Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పోలీసులకు చిక్కిన పాత నేరస్థులు బంగారు ఆభరణాలు, వెండి, ద్విచక్రవాహనాలు స్వాధీనం

0

రాజమండ్రి

తూర్పుగోదావరి జిల్లాలో పలు రీ కేసుల్లో నిందితులైన నలుగురు పాత నేరస్థులను రాజమండ్రి ప్రకా శంనగర్ స్టేషన్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. సీఐ పవనకుమార్ రెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. వీఎలప్పురంలో వుంటున్న వ్యాపారి పి.పుష్పరావు తన ఇంట్లో సుమారు 122 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి వస్తువులు చోరీ అయినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు, సీసీ కెమెరా ఫుటేజీల ఆధా రంగా నిందితులను గుర్తించి వారి కదలికలపై నిఘా వేసి వలపన్ని పట్టుకు న్నారు.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డాంగే నగర్కు చెందిన పోలవరపు నాగ దుర్గా ప్రసాద్ అలియాస్ నాగు, ఏలూరు చేపల తూము సెంటర్కు చెందిన అత్తోటి జానాల్ అలియాస్ జిలేబి, భీమడోలు ప్రాంతానికి చెందిన తల్లిబోయిన నాగ దుర్గారావు అలియాస్ బ్రావో, కర్నాటి విజయ్ కుమార్ అలియాస్ పాండాలు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశామన్నారు. నిందితులపై ద్రవరం ప్రకాశంనగర్ స్టేషన్ పరిధిలో నాలుగు చోరీ కేసులు, ద్విచక్ర వాహనం చోరీ, మూడో పట్టణ స్టేషన్ పరిధిలో రెండిళ్లలో చోరీలు, రెండు ద్విచక్ర వాహనాల అపహరణ, పెనుగొండ పోలీసు స్టేషన్ పరిధిలో ఒకటి, నిడ మర్రు పోలీసుస్టేషన్ పరిధిలో రెండు, గణపవరం స్టేషన్ పరిధిలో ఓ ద్విచక్ర వాహనం చోరీలతో కలిపి మొత్తం 11 కేసులు ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు.  నిందితులనుంచి 121 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు చరవాణులు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie