Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు

సోనియా రాహుల్, ప్రియాంకలకు ఆహ్వానం

0

హైదరాబాద్, డిసెంబర్ 6 ,

తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. దీని కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోని ప్రముఖులకు ఆహ్వానం వెళ్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ జగన్ మోహన్ రెడ్డిని అహ్వానించారు. ఆయనతోపాటు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును పిలిచారు. తెలంగాణ మాజీ సీఎం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కూడా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పిలిచారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌కి కూడా ఆహ్వానం అందింది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానాలు అందాయి. ఎన్నికల్లో సహాయక సహకారాలు అందించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌తోపాటు గాదె ఇన్నయ్య, హరగోపాల్‌, కంచె ఐలయ్యను ఆహ్వించారు.

వివిధ కుల సంఘాల లీడర్లను కూడా ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు సీనియర్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా సహా ఇతర నేతలందర్నీ ఆహ్వానించారు. ప్రత్యేకంగా వారందరితో సమావేశమై తనకు పదవీ బాధ్యతలు అప్పగించనందుకు కృతజ్ఞతలు చెబుతూనే గురవారం జరిగే పదవీ ప్రమాణోత్సవానికి హాజరుకావాలని రిక్వస్ట్ చేశారు. వీళ్లతోపాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్యను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు.తెలుగు రాష్ట్రాల్లో వేరే పార్టీ నేతల ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లే పరిస్థితి గతం నుంచి లేదు. ఈసారి అలాంటి పరిస్థితి కనిపించనుందా అంటే అనుమానంగా ఉంది. జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెళ్లారు. ఇప్పుడు మరి తెలంగాణ సీఎం ప్రమాణానికి ఏపీ సీఎం జగన్ వస్తారా అనేది అనుమానంగానే ఉంది.

  మరోవైపు రేవంత్ రెడ్డిని సీఎల్పీగా ఎన్నుకట్టు గవర్నర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలియజేశారు. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ సంతకాలు చేసిన పత్రాన్ని రాజ్‌భవన్‌కు పంపించారు. రాహుల్ ట్వీట్ లంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ వేశారు. తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు రాహుల్. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తన ఆరు గ్యారెంటీలు నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రజాసర్కార్ ఏర్పాటు చేస్తామని అన్నారు రాహుల్. రేవంత్ రెడ్డితో ఉన్న ఫొటోలను రాహుల్ తన ట్వీట్ కి జతచేశారు.ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ఉదయాన్నే ఆయన మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ ని కలిశారు. అనంతరం సోనియా గాంధీ ఇంటికి వెళ్లారు. అక్కడ సోనియా, రాహుల్, ప్రియాంకను కలసి ధన్యవాదాలు తెలిపారు.

తనకు సీఎంగా అవకాశమిచ్చినందుకు అగ్రనేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు రేవంత్ రెడ్డి.  వారి ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్ లో రేపు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని వారిని ఆహ్వానించారు. మంత్రివర్గంపై మంతనాలు ఢిల్లీ పర్యటనలోనే తెలంగాణ మంత్రి వర్గంపై కూడా రేవంత్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నారు. అధినాయకత్వంతో చర్చలు జరిపి ఆయన తెలంగాణ మంత్రి వర్గం జాబితాపై ఆమోద ముద్ర వేయించుకోబోతున్నారు. రేవంత్ వర్గంతోపాటు.. రేవంత్ ని వ్యతిరేకిస్తున్న సీనియర్ వర్గానికి కూడా మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించే అవకాశముంది. డిప్యూటీసీఎంల దగ్గరే పీటముడి పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీలు ఇద్దరు ఉంటారా, లేక ఒకరితోనే(భట్టి విక్రమార్క) సరిపెడతారా అనేది తేలాల్సి ఉంది.

మంత్రి వర్గ జాబితా కూడా ఫైనల్ అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరతారు. మంత్రి వర్గం కూడా కొలువుదీరే అవకాశముంది. దీనికి సంబంధించి ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి కసరత్తులు పూర్తి చేస్తారు. సీఎంతోపాటు మంత్రి వర్గం కూడా కొలువుదీరితే.. ఆరు గ్యారెంటీల వ్యవహారం కూడా ఓ కొలిక్కి వస్తుంది. తర్వాత ఈనెల 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కృతజ్ఞత సభలోనే ఆరు గ్యారెంటీలపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఆరు గ్యారెంటీలను యథాతథంగా అమలు చేస్తారా లేక అందులో ఏమైనా మెలికలు ఉంటాయా అనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలన్నీ అలాగే అమలు చేయాలంటే బడ్జెట్ కేటాయింపుల్లో సమతూకం ఉండాలి.

ఆ దిశగా రేవంత్ రెడ్డి కసరత్తులు చేయాలి, మిగతా విభాగాలకు కేటాయింపులు తగ్గించాల్సి ఉంటుంది. ఎలా చూసినా ఇది కత్తిమీద సాము అని చెప్పాలి. హైదరాబాద్ కు రాహుల్.. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వస్తారని తెలుస్తోంది. ఖర్గే, డీకే.. కూడా ఈ కార్యక్రమానికి వస్తారని అంటున్నారు. తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ పాలన మొదలవుతున్న సందర్భంలో.. విజయోత్సవాలను అగ్రనేతలు సెలబ్రేట్ చేసుకుంటారు. అందులోనూ.. ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో.. కాంగ్రెస్ కేవలం తెలంగాణలో మాత్రమే పరువు దక్కించుకుంది. దీంతో ఈ విజయోత్సవాలను ఘనంగా జరుపుకోవాలనుకుంటున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. మొత్తమ్మీద సీఎం ఎంపిక సాఫీగా పూర్తవడం, ఎలాంటి అసంతృప్తికి అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం హడావిడి లేకుండా ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie