Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బాలినేనిపై అనుచరుల ఒత్తిడి

0

ఒంగోలు, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్)
బాలినేని పరిస్థితి ప్రత్యర్థి పార్టీ నేతలకు కూడా రాకూడదని అంటూ జాలిపడుతున్నారు సొంత పార్టీ నేతలు. పార్టీలో తగిన గౌరవం లేకపోవడం.. ఆ బాధను వెళ్లగక్కుతూ అల్టిమేటం జారీచేయడం.. ఇంతలోనే తాడేపల్లి నుండి పిలుపు రావడం.. అక్కడ బుజ్జగింపులు.. కాలరెగరేసుకుని బయటకు వచ్చినా  పార్టీలో ప్రాధాన్యత విషయంలో షరామామూలు పరిస్థితి.. గత నాలుగేళ్లుగా బాలినేని పరిస్థితి పార్టీలో ఇలాగే కొనసాగుతోంది.  ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్‌ కీలక నేత. నాడు వైఎస్సార్.. నేడు జగన్ హయాంలోనూ ఓ వెలుగు వెలిగారు. అయితే, ఇదంతా వైసీపీ అధికారంలోకి రాకముందు మాట. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బాలినేనికి ప్రాధాన్యత  సంగతి అటుంచి కనీస గౌరవం, మర్యాదా కూడా లేకుండా పోయింది.  జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బాలినేనికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. అంతకు ముందు ఆయన మంత్రి పదవిని వదులుకొని జగన్ వెంట వచ్చారు.

లైసెన్సులు మరో  ఏడాది

బహుశా అందుకే  తొలి క్యాబినెట్ లో ఆయనకు అవకాశం దక్కింది. కానీ  మంత్రి వర్గ విస్తరణలో బాలినేనిని మంత్రి పదవి నుంచి జగన్ తప్పించారు. అదే సమయంలో అదే ప్రకాశం జిల్లాకు చెందిన సురేష్ ను కేబినెట్ లో కొనసాగించారు.  దీనిపై బాలినేని మనస్తాపానికి గురయ్యారు. దానిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డెక్కారు. చివరికి తాడేపల్లి ప్యాలస్ నుంచి పిలుపు వచ్చింది. బుజ్జగించారు. బాలినేని సర్దుకు పోయారు. ఇఖ అక్కడ నుండి వైసీపీలో ఆయనను పక్కన పెట్టేయడం ఆరంభమైంది. ఇది కాస్త తారాస్థాయికి చేరడంతో బాలినేని ఆ మధ్య అసంతృప్తికి లోనయ్యారు. కారణామేంటా అని ఆరాతీస్తే.. సొంత జిల్లాలో ఆయనకు ప్రాధాన్యత లేకపోవడంతో కినుకు వహించారని తేలింది. ఆఖరికి పోలీసులు, ఎమ్మార్వోలు, ముఖ్య అధికారుల బదిలీల విషయంలో కూడా ఆయనకు తెలియకుండానే అన్నీ  జరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటకు చెప్పుకుని ఆవేదనకు గురయ్యారు.  అప్పట్లో ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది.బాలినేని అసంతృప్తికి కారణం వైవీ సుబ్బారెడ్డే అని అందరికీ తెలిసిందే. నిజానికి సుబ్బారెడ్డి, బాలినేనికి ఇద్దరికీ సీఎం జగన్ తో బంధుత్వం ఉంది. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి ఇద్దరూ కలిసే పార్టీ కోసం పని చేసారు.

రాష్ట్రంలో గ్లోబల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ రూ.16,650 కోట్ల పెట్టుబడి

కానీ, తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. అధిష్టానం సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంతో బాలినేని అలకబూని మీడియాకెక్కారు. దీంతో అధిష్టానం పిలిచి బుజ్జగించడంతో అప్పటికి అది సమసిపోయింది. కానీ ఇప్పుడు మరోసారి బాలినేనికి అదే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిలను  పార్టీ సస్పెండ్ చేసింది. వీరిద్దరూ పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. బాలినేనికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించిన బాలినేని.. 48 గంటల్లోగా తన అనుచరులను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే డైరెక్ట్ గా జగన్ ను కలుస్తానని హెచ్చరికలాంటి అల్టిమేటమ్ జారీ చేశారు. అయితే, పరిస్థితి చూస్తే మాత్రం బాలినేనిరి  పొమ్మనలేక పొగబెడుతున్నారనే చర్చ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తున్నది. ఇదంతా సీఎం జగన్ కు తెలిసే జరుగుతోందని కూడా అంటున్నారు.

త్వరలోనే మిషన్(శుక్ర గ్రహం) వీనన్ : ఇస్రో ఛైర్మన్ సోమనాథ్..

బాలినేనిని పక్కన పెట్టడం అనే కార్యక్రమం అంతా  సీఎం కనుసన్నల్లోనే జరుగుతోందని అంటున్నారు. తాజాగా విజయసాయిరెడ్డిని ఈజిల్లాకు ఇన్ చార్జ్ గా నియమించారు. కానీ, బాలినేనికే ప్రాధాన్యం ఉంటుందని చెప్పిన అధిష్టానం.. బాలినేనే జిల్లాను చూసుకుంటారని కూడా చెప్పారు.కానీ పరిస్థితి చూస్తే మాత్రం తేడాగా కనిపిస్తుంది. మొన్నటి వరకూ వైవీ సుబ్బారెడ్డి బాలినేనికి బల్లెంలా తయారైతే ఇప్పుడు విజయసాయిని స్వయంగా అధిష్టానమే పంపించడం చూస్తుంటే జగన్ కే  బాలినేని జిల్లాపై పెత్తనం చేయడం ఇష్టంలేదన్న అనుమానాలు పార్టీ వర్గాలలోనే వ్యక్తం అవుతున్నాయి.  అయితే పలుమార్లు అవమానించినా బాలినేని మాత్రం పార్టీని పట్టుకు వేలాడడం ఆయన అనుచరులకు సుతరామూ నచ్చడం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోండంటూ ఆయనపై ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. చూడాలి ఇప్పటికైనా బాలినేని ఆయన దారి ఆయన చూసుకుంటారా? లేక మళ్ళీ బుజ్జగింపులకు తలొగ్గి పార్టీలోనే కొనసాగుతారా అన్నది చూడాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie