Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బిక్కాజిపల్లి గ్రామం లో ఉద్రిక్తత

0

వరంగల్

వరంగల్ జిల్లా :దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామం లో శనివారం  ఉద్రిక్తత నెలకొంది.
శుక్రవారం రాత్రి వేల మంది విద్యార్థులు చిక్కడ్ పల్లిలో  ఆందోళనకు దిగారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడటంతో ఆవే దన చెందిన ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరి గింది. వరంగల్ కి చెందిన ప్రవల్లిక(23) అశోక్ నగ ర్లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్లో ఉంటూ గ్రూప్-2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది.  పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన ప్రవల్లిక తానుంటున్న హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు.

 చిక్కడపల్లి ఏసీపీ ఏ.యాదగిరి, ఇన్స్పెక్టర్ పి.నరేష్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించే సమయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు.  మృతురాలి కుటుంబానికి  న్యాయం చేయాలని, ఆమె సూసైడ్ లెటర్ బయట పెట్టాలని కోరారు.  సీఎం కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్డడౌన్ అంటూ నినాదాలు కేసీఆర్ సర్కార్ దిగిపోవాలని చేశారు.  పోటీ పరీక్షలు నిర్వహించడంలో విఫలమైనదని డిమాండ్ చేశారు.  టీఎస్సీఎస్సీని రద్దుచేసి యూపీఎస్సీకి ఇవ్వాలని, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.  అర్ధరాత్రి దాటే వరకు నిరసన కొనసాగింది.  విద్యార్థుల నిరసనకు కాంగ్రెస్, బీజేపీలతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు మద్దతు పలి కాయి.

విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్, బీజేపీ ఎంపీ డాక్టర్ కే.లక్ష్మణ్, హరియాణా గవర్నర్ బండారు దత్తా త్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి తదితరులు విద్యార్థులు ఆందోళన చేస్తున్న చోటుకు వచ్చారు. విద్యార్థులతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. మరోపక్క విషయం తెలుసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఆయా కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు అశోక్ నగర్ కేంద్ర గ్రంథాలయం వద్దకు వేల సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి అశోక్ నగర్ ఎన్టీఆర్ స్టేడియం వరకు రోడ్డు మొత్తం విద్యార్థులతో నిండిపోయింది. నిరుద్యోగుల జీవితా లతో చెలగాటమాడుతున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని వారంతా నినాదాలు చేశారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie