యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన స్థానికులు ఆసుపత్రి సిబ్బంది మంటలను ఆర్పి ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడ ఉన్న ఆసుపత్రి సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ షాక్ తో ప్రమాదానికి కారణమా లేక ఆకతాయిలు ఎవరైనా తగులబెట్టారని పోలీసులు విచారణ చేస్తున్నారు.