Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బుగ్గ రస్తా వీధిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం

0

నంద్యాల
చాగలమర్రి గ్రామంలోని బుగ్గ రస్తా వీధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హెల్త్ సూపర్వైజర్  రామలింగారెడ్డి ఆధ్వర్యంలో  బుగ్గరస్తా వీధిలో ఉన్నటువంటి వృద్ధులకు, పేషెంట్లకు , గర్భవతులకు బీపీ మరియు షుగర్ పరీక్షలు నిర్వహించి  వాటిని అదుపులో ఉంచుకోవడానికి  ఏ ఏ ఆహార పదార్థాలు తినాలి మరియు ఎక్కువ ఆలోచనలు చేయకుండా, కోపం ఎక్కువ తెచ్చుకోకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఎటువంటి జబ్బులు దరి చేరవని సూపర్వైజర్ సలహాలు ఇచ్చారు. ఈనెల  21 వ తారీఖున శ్రీ వాసవి డిగ్రీ కళాశాల నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. అక్కడికి ప్రభుత్వ డాక్టర్లు వచ్చి ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలకు తగినటువంటి సూచనలు మరియు మందులను ఉచితంగా పంపిణీ చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని హెల్త్ సూపర్వైజర్ పేషెంట్లకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం వసంత కుమారి, ఆశ వర్కర్ విజయలక్ష్మి, వాలంటీర్ గౌసియా  తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie