విజయవాడ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో ప్రజలు విష జ్వరాలతో విల విల్లాడుతున్నారు. ఇంటింటా జ్వర పీడితులు వున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిట కిట లాడుతున్నాయి. విషజ్వరాలు ఇంటిల్లిపాదిని చుట్టబెడుతున్నాయి. దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు,ప్లేట్ లెట్స్ తగ్గి పోవటం లక్షణాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. పట్టణం లో అద్వాన్న పారిశుధ్యం, దోమలు స్వైర విహారం తో రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మున్సిపల్ పరిపాలన శాఖ అధికారుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, పట్టణం లో డెంగ్యూ జ్వరాలు లేనే లేవని ప్రభుత్వ వైద్య అధికారులు, ఏఎన్ ఏం లు అంటున్నారు.