మంథని
ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా మంథని డిపో గేట్ వద్ద శుక్రవారం పలు డిమాండ్ లతో కూడిన బ్యాడ్జిలు ధరించి ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో కార్యదర్శి రాపెల్లి రాజయ్య మాట్లాడుతూ ప్రభుత్వం లో విలీనానికి ముందే 2017, 2021 పేస్కేల్స్ అమలు చేయాలని, అదేవిధంగా 2013 పిఆర్సికి సంబంధించి బాండ్ డబ్బులు ఇప్పించాలని ఆయన కోరారు. అదేవిధంగా సిసిఎస్ డబ్బులు వడ్డీతో సహా చెల్లించాలని, ఎస్అర్బిఎస్,ఎస్బిటి మరియు పిఎఫ్ బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్టీసీ జేఏసీ నాయకులు పల్లెర్ల ఆంజనేయులు, రాజయ్య, ప్రవీణ్ లు పాల్గొన్నారు.