Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా..?

ప్రశ్నస్తే దాడులకు దిగుతారా.. బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి...

0

జగిత్యాల

నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్(కే) గ్రామంలో  దళితబందు ఎంపికలో అవకతవకలు జరిగాయని అనర్హులను ఎంపిక చేశారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయబోయిన దళిత మహిళను కడుపులో తన్నిన ఆ గ్రామ సర్పంచ్ పై చర్యలు తీసుకొవాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మొదటి నుండి బిఆరెస్
పార్టీకి మహిళలు అంటే గౌరవం లేదని అందుకే గతంలో ఒక్క మహిళా మంత్రి కూడ లేరని అన్నారు. అంతేకాక మంత్రులు ఎర్రబెల్లి ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వనమా వెంకటేశ్వర్ రావు, శంకర్ నాయక్, పాడి కౌశిక్ రెడ్డి లాంటివారు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమాన పరచినా కెసిఆర్, కేటీఆర్, కవిత ఏనాడూ స్పందించలేదన్నారు.

నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజీద్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి హైదరాబాద్ తీసుకెల్లి అత్యాచారం చేసి ఈ విషయం బయటకు చెప్పితే చంపేస్తా అని బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్చినా కేటీఆర్ ప్రాతినిత్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక సర్పంచ్ భర్త రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ఇంట్లో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేస్తే రాష్ట్రములో ఉన్న మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని కళావతి ప్రశ్నించారు. మహిళా బిల్లు తనవల్లనే సాధ్యమైందని చెప్పుకునే కవిత వెంటనే స్పందించి భాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో

సింధూ పటేల్, బండపెల్లి మల్లేశ్వరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie