Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు జన్మదిన వేడుకలు

0

విశాఖపట్నం

మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు 68వ జన్మదిన వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి.గురునాథరావు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయన విగ్రహానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు.విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న గుడివాడ గురునాథరావు విగ్రహానికి ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు,గురునాథరావు తనయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నా థ్ పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బూడి ముత్యాల మాట్లాడుతూ గురునాథ రావు తన హయాంలో అనేక మంది కార్యకర్తలను నాయకులుగా తయారు చేశారని అన్నారు.ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ గురునాథరావు మార్కు మార్కు అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. ముఖ్యంగా పేదవాళ్లకు విరివిగా ఇళ్లు మంజూరు చేసి, వారి గుండెల్లో గురునాథరావు నిలిచిపోయా రని ముత్యాలరావు కొనియాడారు.మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ తన తండ్రి గుర్నాథరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఈ ప్రాంతానికి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. శివారు ప్రాంతాలైన ఆరిలోవ, హనుమంతవాక తదితర ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందడానికి గురునాథరావు వేసిన పునాది కారణమని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie