Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మానసికంగా సిద్ధమవుతున్న బ్రహ్మణి….

0

రాజమండ్రి, సెప్టెంబర్  29, (న్యూస్ పల్స్)

టీడీపీ శ్రేణుల్లో ఎప్పటి నుంచో వినిపిస్తున్న పేరు.. నారా బ్రహ్మణి. తెలుగుదేశం అధినేత.. చంద్రబాబును అరెస్ట్ చేయడం.. యువనేత లోకేష్ ను అరెస్టు చేస్తారని చెబుతుండటంతో.. ఎప్పటి నుంచో అడపా దడపా వినిపిస్తున్న ఆ పేరు మరి కాస్త ఎక్కువుగా లౌడ్ గా వినిపిస్తోంది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని.. పార్టీలో లీడ్ రోల్ ప్లే చేయాలని చాలా సందర్భాల్లో చర్చకు వచ్చినా.. తెలుగుదేశం అధినాయకత్వం మాత్రం ఆమెను ముందుకు తీసుకురాలేదు. తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటన్నది.. దాదాపు 15ఏళ్లుగా ప్రశ్నార్థకమే. 2009 తర్వాత జూనియర్ పార్టీకి దాదాపు దూరం అయ్యారు. పార్టీకి దగ్గరగా లేరు… అలాగని దూరం జరిగినట్లూ చెప్పలేదు. తెలుగుదేశం పూర్తిగా ఢీలా పడిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు.. పార్టీ బాధ్యతలను ఆయన తీసుకుంటారని.. చంద్రబాబు ఉన్నంత కాలం రాజకీయాల్లోకి రారని.. జూనియర్ అభిమాన వర్గం, తెలుగుదేశం వ్యతిరేక వర్గం ప్రచారం సాగిస్తూ ఉన్నాయి. జూనియర్ చాన్స్ కోసం చూస్తున్నారన్నది వీళ్ల అంచనా.. అయితే బ్రహ్మణితో జూనియర్ కు చెక్ పెట్టొచ్చు అని ఆమె రాకను కోరుకునే వారు ఆశిస్తున్నారు.

చంద్రబాబు పార్టీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్నారనే విమర్శ ఉన్నందున నందమూరి వారసురాలిగా ఆమె వస్తే.. దానిని ప్రశ్నించే సాహసం ఇంకెవరూ చేయరు అని ఆమె సపోర్టర్స్ భావిస్తున్నారు. బ్రహ్మణి ఇంత వరకూ పెద్దగా యాక్టివ్ రాజకీయాల్లో లేరు. 2019లో లేకష్ మంగళగిరి నుంచి పోటీ చేసినప్పుడు.. కొన్ని సభల్లో పాల్గొని ఓట్లు అడిగారు. అలాగే విజయవాడ, గుంటూరు లోక్ సభ నుంచి ఆమె పోటీ చేస్తారని ఎన్నికలప్పుడు వినిపిస్తూ ఉంటుంది తప్పితే.. అవి నిజం కాలేదు. మరి ఇప్పుడు పరిస్థితులు ఆమె రావలసిన అవసరాన్ని సృష్టించాయి. బ్రహ్మణి కూడా అందుకు సిద్ధమైనట్లుగా ఆమె రియాక్షన్స్ చెబుతున్నాయి.రాష్ట్రంలో అంగన్ వాడీ కార్యకర్తలపై పోలీసుల దాడులను తప్పు పడుతూ చేసిన పోస్ట్ అది… తన మామ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు.. కుటుంబ సభ్యురాలిగా ఆమె బయటకు వచ్చి..టీడీపీ శ్రేణులతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా వచ్చిన వారితో కలిసి మాట్లాడారు.

అంతవరకూ అర్థం చేసుకోదగిందే. కానీ బ్రహ్మణి ఇప్పుడు చేసిన ఈ ట్వీట్ … పూర్తిగా రాజకీయాలకు సంబంధించింది. అసలు మూడేళ్లుగా ట్విటర్ లో యాక్టివ్ గా లేని బ్రహ్మణి ఓ పది పదిహేను రోజులుగా చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన విషయాలను మాత్రమే పోస్టు చేస్తున్నారు. కానీ రెండు రోజుల కిందట ఈ పోస్టు చూస్తే..అది ఆయన అరెస్టుకు సంబంధం లేనిది. జగన్ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ ఓ మహిళా అంశాన్ని ఎంచుకున్నారు. ఇక నుంచి ఇలాంటి వాటిపై ఆమె నుంచి మరిన్ని రావొచ్చని భావించొచ్చేమో.. ?ఎప్పటి నుంచో బ్రహ్మణి బయటకు రావాలని.. ఆమె పార్టీకి ట్రంప్ కార్డు అవుతుందని భావిస్తున్న క్యాడర్.. ఆ సంఘటనతో ఫుల్ ఖుషీ అయిపోయారు. కొన్ని రోజులు రాజకీయ సభల్లో పాల్గొంటే ఆమె మరింత రాటుదేలుతారని.. నందమూరి వారసురాలిగా ఆమె రాక పార్టీని మరో మెట్టు ఎక్కిస్తుందని వారంతా ఆశిస్తున్నారు.

అయితే బ్రహ్మణి రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటున్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా ఆ సంకేతాలు ఇవ్వలేదు. హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా ఆ బాధ్యతలను ఆమె సమర్థంగా నిర్వహిస్తున్నారు.. కానీ నారా బ్రాహ్మణి టీడీపీ తరపున యాక్టివ్‌గా రాజకీయాలు చేయాలని క్యాడర్ నుంచి డిమాండ్ పెరుగుతోంది. జరగబోయే దానిపై ఓ స్పష్టత వచ్చినందునేమో.. నారా బ్రాహ్మణి ఎగ్రెసివ్ గా ప్రజాసమస్యలపై స్పందిస్తున్నారు.  అంగన్‌వాడి మహిళలు, టీడీపీ మహిళా నేత పరిటాల సునీత పై పోలీసుల వ్యవహరించిన తీరుపై   ఘాటుగా స్పందించారు. ఏపీలో శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీల్లో ప్రభుత్వ ప్రేరేపిత హింస చూసి షాక్ కు గురవుతున్నానన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే అంగన్‌వాడి కార్మికులపై దాడులు దుర్మార్గమన్నారు. బ్రాహ్మణి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన స్పందనలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బ్రాహ్మణి రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంఘిభావం తెలిపేందుకు వస్తున్న నేతలతో రాజకీయాలు చర్చిస్తున్నారు. జనసేన నేతలు వచ్చి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగులతో మాట్లాడారు. దాదాపుగా ప్రతి రోజూ రాజకీయాలపై మాట్లాడుతున్నారు ఇక ముందు ఈ రాజకీయం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie