Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అతిథిగా ఘనంగా జరిగిన “రామన్న యూత్” ప్రీ రిలీజ్ వేడుక

0

టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. సోమవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ప్రియదర్శి, తిరువీర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా
యాక్టర్ అనిల్ గీల మాట్లాడుతూ – మై విలేజ్ షో ద్వారా మాకెంతో పేరొచ్చింది. ఎంతోమంది స్టార్ హీరోలు తమ సినిమాల ప్రమోషన్ కోసం మా విలేజ్ కు వచ్చారు. వాళ్లు వెళ్లేప్పుడు సినిమాలో అవకాశం ఉంటే ఇమ్మని అడిగేవాళ్లం. అయినా పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్ని సినిమాలు చేసినా చాలా చిన్న క్యారెక్టర్స్ వచ్చాయి. అలాంటి టైమ్ లో అభయ్ నవీన్ అన్న ఈ సినిమా కథ చెప్పాడు. పోస్టర్ మీద నీ ఫొటో ఉంటది అన్నాడు. ఈ సినిమా చేసేప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఎంత కష్టమో చూశాను. అవన్నీ ఎదుర్కొని అభయ్ అన్న సినిమా కంప్లీట్ చేశాడు. మంచి సినిమా అయితేనే చాలదు. దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు చాలా పనులు ఉంటాయి. మా చిత్రాన్ని థియేటర్ లో చూడండి. మీకు నచ్చుతుంది. అన్నారు.

యాక్టర్ యాదమ్మ రాజు మాట్లాడుతూ – జార్జ్ రెడ్డి సినిమా చేసినప్పటి నుంచి అభయ్ అన్నతో పరిచయం. ఈ సినిమాలో మంచి రోల్ ఇచ్చాడు. విలేజ్ లో జరిగే ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామా ఇది. ఈ నెల 15న థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు
యాక్టర్ తాగుబోతు రమేష్ మాట్లాడుతూ – సినిమాల్లో ఎ‌వరు బాగా నటించినా నేను ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తుంటాను. అలా పెళ్లి చూపులు టైమ్ నుంచి అభయ్ ఏ సినిమాలో నటించినా ఫోన్ చేసి చెప్పేవాడిని. అలా మా మధ్య స్నేహం మొదలైంది. ఒక రోజు నన్ను కలిసి కథ చెప్పాడు. ఒక చిన్న పాయింట్ ను ఎంతో ఆకట్టుకునేలా కథ నెరేట్ చేశాడు. తమిళ, మలయాళ సినిమాలు చూసినప్పుడు ఒక చిన్న పాయింట్ తో ఎంత బాగా సినిమా చేశారనిపిస్తుంది.

ఈ కథ విన్నప్పుడు నాకు అలా అనిపించింది. రామన్న యూత్ లో నాకు అనిల్ అన్న అనే క్యారెక్టర్ ఇచ్చాడు. సగం సినిమాలో నేనుంటా, మిగతా సగంలో నా పేరు వినిపిస్తుంటుంది. అభయ్ ఎంతో క్లారిటీగా సినిమాను తెరకెక్కించాడు. అతని హార్డ్ వర్క్ చూసి ఆనందంగా అనిపించింది. ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చేందుకు వచ్చిన విశ్వక్, ప్రియదర్శి,  తిరువీర్ కు థాంక్స్ చెబుతున్నా. అన్నారు.
హీరోయిన్ అమూల్య రెడ్డి మాట్లాడుతూ – నందు గారి ద్వారా ఈ సినిమాలో నాకు నటించే అవకాశం వచ్చింది. నేను ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు అభయ్ నవీన్ సార్ ఎంతో సపోర్ట్ చేశారు. డైలాగ్స్ దగ్గర నుంచి ఎంతో ఓపికగా బాగా చెప్పేలా చేశారు. ఇవాళ నేను ఇంత మంది ముందు ఈ వేడుకలో మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది.

రామన్న యూత్ సినిమా కొత్తగా ఉంటుంది, మీకు డిఫరెంట్ ఎక్సీపిరియన్స్ ఇస్తుంది. థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.
సిల్లీ మాంక్స్ నుంచి అనిల్ మాట్లాడుతూ – స్మాల్ మూవీ మేకర్స్ అందరిలాగే అభయ్, శివ ఈ సినిమాను ఎలా రిలీజ్ చేయాలని స్ట్రగుల్ పడ్డారు. మేము సినిమా చూశాం. వెంటనే మరో థాట్ లేకుండా రామన్న యూత్ సినిమాకు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అభయ్ నవీన్ తనకున్న వనరుల్లో మంచి సినిమా చేశాడు. నటుడిగా, దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. సినిమా మాకు బాగా నచ్చింది. అందుకే మూవీకి సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చాం. ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

కో ప్రొడ్యూసర్ శివ మాట్లాడుతూ – మా ఫ్రెండ్ సర్కిల్ లో సినిమాల గురించే ఎక్కువ డిస్కషన్స్ చేస్తుంటాం. కాంపాక్ట్ బడ్జెట్ లో మూవీస్ చేయడం ఎలా అనేది ఆలోచించేవాళ్లం. అలా వచ్చిన కొన్ని సినిమాలను అబ్సర్వ్ చేశాం. అలాంటి టైమ్ లో కత్తి మహేశ్ ద్వారా అభయ్ నవీన్ పరిచయం అయ్యాడు. అతను చెప్పిన కథ విన్నాక…ఒక యూనిక్ పాయింట్ ను సినిమాటిక్ వేలో బాగా కథ రాశాడు అనిపించింది. కానీ మేకింగ్ మేము అనుకున్నంత ఈజీగా కాలేదు. మంచి సినిమా చేశామని చెప్పగలను. మీరు చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు
హీరో, దర్శకుడు అభయ్ నవీన్ మాట్లాడుతూ – మాది సిద్ధిపేట. నాన్న మ్యాథ్స్ టీచర్. సినిమాల్లోకి నేను వెళ్లడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. రిలేటివ్స్ మీ వాడు సినిమాలంటూ తిరుగుతున్నాడు అని కంప్లైంట్స్ చెప్పేవాళ్లు. సినిమా తీయాలనేది నా కల. నా పట్టుదల చూశాక ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేయడం ప్రారంభించారు. వీళ్లంతా నన్ను నమ్మకపోతే నేను సినిమా చేయగలిగే వాడిని కాదు. బొమ్మలరామారం సినిమా టైమ్ నుంచి ప్రియదర్శి, తిరువీర్ పరిచయం. ప్రియదర్శి చెబితే పెళ్లి చూపులు ఆడిషన్స్ వెళ్లా. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్పినా నేను నమ్మలేదు. కానీ ఆ సినిమాలో అవకాశం వచ్చింది. ఇప్పటికీ నన్ను కొందరు పెళ్లి చూపులు సినిమాలోలాగ యూకలిప్టస్ అని పిలుస్తుంటారు. అభయ్ అని కొందరు, నవీన్ అని కొందరు అంటారు. నా వెనక ప్రియదర్శి, తిరువీర్, తరుణ్ భాస్కర్, జీవన్ రెడ్డి, పవన్ సాధినేని లాంటి వాళ్లంతా ఉన్నారనే ధైర్యంతో రామన్న యూత్ స్టార్ట్ చేశాను. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కు స్క్రిప్ట్ ఇస్తే చదవలేదు. వన్ లైన్ ఆర్డర్ ఇచ్చినా చదవలేదు. సినిమా పూర్తయ్యాక స్క్రీన్ మీద చూశారు. ఆ ప్రొడ్యూసర్ ఎవరో ఎవరికీ తెలియదు.

ఆయనకు మంచి సినిమా చేయాలి అనేది మాత్రమే తెలుసు. నా టీమ్ నాకు పెద్ద బలం. ముందు సినిమా చేయి అన్నా అనేంత సపోర్ట్ ఇచ్చారు. వారందిరికీ నా థాంక్స్ చెబుతున్నా. మా ఫంక్షన్ కు రావాలని అడగగానే విశ్వక్ వెంటనే రిప్లై ఇచ్చాడు. ఆయనది గోల్డెన్ హార్ట్. మా లాంటి చిన్న సినిమాకు ఎంకరేజ్ మెంట్ ఇవ్వాలని ఆయన ఇక్కడకు వచ్చారు. ఇలాంటి వాళ్లుంటే ఎంతోమంది కొత్త వాళ్లకు సపోర్ట్ దొరుకుతుంది.  విశ్వక్ కు థాంక్స్ చెబుతున్నా. మంచి సినిమా చేశామనే ధైర్యాన్ని మాకు మొదట ఇచ్చింది సిల్లీ మాంక్స్ అనిల్ అన్న. మా సినిమాకు ఇలా ప్రీ రిలీజ్ చేసి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకోవడమే పెద్ద సక్సెస్. ప్రేక్షకులకు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తెలియదు. మంచి కథ ఉంటే సినిమా తప్పకుండా చూస్తారు. ఈ నెల 15 నా లైఫ్ లో స్పెషల్ డే. ఆ రోజును మా నాన్నకు అంకితఇస్తా. ఇక రామన్న యూత్ సినిమా మీ చేతుల్లోకి వచ్చేసింది. ట్రైలర్ నచ్చితే అందరికీ షేర్ చేయండి. మా సినిమాను థియేటర్ లో చూసి ఎంకరేజ్ చేయండి. అన్నారు.
హీరో తిరువీర్ మాట్లాడుతూ – ఒకప్పుడు నాతో కలిసి ఆటోలో తిరిగిన అభయ్ నవీన్ ఇప్పుడు ఇలా సినిమా చేశాడని అంటే ఆనందంగా ఉంది. డబ్ స్మాష్ ద్వారా చాలా వీడియోలు చేసేవాడు. కలిసి సినిమాలో నటించాం. అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చిన అభయ్..ఇప్పుడు డైరెక్టర్ అయి మా ఫ్రెండ్స్ కు అవకాశాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. అభయ్ డైరెక్టర్, రైటర్, ఎడిటర్ అన్నీ అయ్యాడు.

ఇది అతని కెరీర్ లో మొదటి మెట్టు మాత్రమే. తన సినిమాను రిలీజ్ వరకు తెచ్చుకోవడమే అభయ్ ఫస్ట్ సక్సెస్. ఈ సినిమాకు అతనికి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. అభయ్ నాకు కూడా కథ చెప్తా అన్నాడు. ఈ నెల 15న లాంగ్ వీకెండ్ వస్తోంది. సినిమాను థియేటర్ లో చూడండి. ఎంకరేజ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే అభయ్ రామన్న యూత్ లాంటి మంచి సినిమాలు మరిన్ని చేస్తాడు. అన్నారు.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ – అభయ్, తిరువీర్, నేను ఇంకొంతమంది ఫ్రెండ్స్..పదేళ్లుగా ఇండస్ట్రీలో స్ట్రగుల్ పడ్డాం. ఈ స్టేజీ మీద చెబుతున్నా..మనం కలలు కనొచ్చు. డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ చాలా పేరు తెచ్చుకున్నాడు అభయ్. ఒకసారి రాజమండ్రి వెళ్లి ఎవరికో యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇచ్చాడు. ఇక్కడ మేము ఆడిషన్స్ చేస్తుంటే అభయ్ ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చేదాకా వెళ్లాడు. రామన్న యూత్ కథ చెప్పాడు.

తను సినిమా సినిమా చేస్తున్నప్పుడు ఎవరైతే తనతో ఉన్నారో ఆ ఫ్రెండ్స్ అందరికీ అవకాశం ఇచ్చాడు. నేను సినిమా చూశాను. చాలా ఫన్ ఫీలయ్యా, అలాగే కొన్ని చోట్ల సర్ ప్రైజ్ అయ్యాను. తాగుబోతు రమేష్ కు మంచి క్యారెక్టర్ ఉంది. అలాగే మిగతా క్యారెక్టర్స్ కూడా యూనిక్ గా ఉన్నాయి. కొన్ని సినిమాలకు తక్కువ, మరికొన్ని సినిమాలకు ఎక్కువ థియేటర్స్ దొరుకుతాయి. కానీ ఈ సినిమాను మీరు తప్పక చూడాలి. మంచి కథ ఉంది. ఎమోషన్ ఉంది. రామన్న యూత్ సినిమాలో ఒక జీవితం ఉంటుంది. అన్నారు.హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ – నా సినిమా ప్రదర్శించే థియేటర్ దగ్గరకు వెళ్లి టికెట్ మీద ఆ సినిమా పేరు చూడాలనుకునేవాడిని. ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ అయినప్పుడు దేవి థియేటర్ కు వెళ్లి వంద టికెట్స్ కొని వాటిని చూసుకుని సంతోషపడ్డాను. మా ఫలక్ నుమా దాస్ సినిమా ఆడిషన్ కు అభయ్ వచ్చాడు. అప్పుడు ఆడిషన్ కు వచ్చిన వారిలో అభయ్ సీనియర్.

సీనియర్ అని జాగ్రత్తగా ఆడిషన్ తీసుకున్నా. చరిత్ర సృష్టించే సినిమాలకు బడ్జెట్ ఇంత ఉండాలనే అవసరం లేదు అని పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, బలగం, మసూద, ఫలక్ నుమా దాస్ వంటి ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టామనేది చూస్తుంటారు చాలా మంది కానీ..ఆ సినిమా వెనక పనిచేస్తున్న వాళ్లు ఎంత టాలెంటెడ్ అనేది చూస్తే అది సినిమాకు అసలైన స్ట్రెంత్ అని నమ్ముతాను. రామన్న యూత్ కు అలాంటి మ్యాజిక్ వర్కవుట్ అవ్వాలని కోరుకుంటున్నా. పొలిటికల్ నాలెడ్జ్ రూరల్ యూత్ కు ఎక్కువగా ఉంటుంది. క్రికెట్, పొలిటికల్ నాలెడ్జ్ వారికే ఎక్కువ ఉంటుంది.

అలాంటి ఫ్లేవర్ ఈ సినిమాలో తీసుకొచ్చాడు అభయ్. ఈ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో  కొంతమంది మహిళలు పనిచేశారని విన్నాను. అమ్మాయిలు ఇండస్ట్రీకి రండి. బాలీవుడ్ లో చాలా మంది వుమెన్ సినిమాకు వర్క్ చేస్తారు. మీరు సెట్ లో ఉంటే అబ్బాయిలకు మోటివేషన్ ఉంటుంది. తరుణ్ భాస్కర్ ఏడాదిన్నర క్రితమే ఈ కథ గురించి చెప్పాడు చాలా బాగుందని. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. హోల్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ నెల 15న రామన్న యూత్ సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie