Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మెట్ల మార్గాన్ని పరిశీలించిన వైల్డ్ లైఫ్ బృందం

0

తిరుమల, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్)

తిరుమల నడక మార్గంలో ఇటీవల కాలంలో అడవి జంతవుల సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. జులై నుంచి చిరుతలు, ఎలుగుబంట్లు ఎక్కువగా ప్రత్యక్షమవుతున్నాయి. ఆగస్టులో చిన్నారి లక్షితను చిరుత దాడి చేసి చంపేయడం కలకలంరేపింది. దీంతో టీటీడీ ఆపరేషన్ చిరుతను చేపట్టింది.. ఇప్పటి వరకు ఆరు చిరుతల్ని బంధించారు. అలాగే నడక మార్గాల్లో కొన్ని ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. అలాగే నడక మార్గంలో కంచె ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నారు.తిరుమల కాలినడక మార్గంలో జంతువుల నుంచి భక్తులకు రక్షణ కల్పించేందుకు కంచె ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై టీటీడీ ఫోకస్ పెట్టింది.

ఈ క్రమంలో అలిపిరి మార్గాన్ని వైల్డ్‌లైఫ్‌ సైంటిస్ట్‌ బృందం పరిశీలన చేయనుంది. ఈ బృందం2 రోజుల పాటు నడక మార్గాన్ని పరిశీలించింది. ఇటీవల నడకమార్గంలో చిరుత దాడితో నడకమార్గానికి ఇనుప కంచె ఏర్పాటుకు టీటీడీ కేంద్రాన్ని అనుమతి కోరింది.ఈమేరకు కేంద్ర వైల్డ్‌లైఫ్‌ డెహ్రాడూన్‌కు చెందిన వైల్డ్‌లైఫ్‌ సైంటిస్ట్‌ రమేష్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. వీరు రెండురోజుల పాటు నడకదారిలో పరిశీలన జరిపి.. ఇనుప కంచె ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేసి కేంద్రానికి సమర్పించనున్నారు. ఇక, నడకమార్గంలో ఆపరేషన్‌ చిరుత కొనసాగుతోంది.. అంతేకాదు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి నడక మార్గంలో జంతువుల జాడ కనిపించలేదు. అయినా సరే ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తున్నారు.. కెమెరాలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. చిరుతలు, అడవి జంతువుల సంచారాన్ని పరిశీలిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie