Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

యువతలో దేశ భక్తి ని పెంపొందిస్తున్న నెహ్రూ యువ కేంద్ర

ఐక్యమత్యానికి నిదర్శనం నా దేశం నా మట్టి బద్వేలు రాచపూడి నాగభూషణం డిగ్రీ కాలేజ్ జరిగిన నా మట్టి నా దేశం కార్యక్రమం ముఖ్య అతిధులు. ఆర్డీవో ఎ.వెంకట రమణ లెఫ్ట్నెంట్ కర్నల్. వినయ్ చంద్రన్

0

బద్వేలు

నా దేశం నా మట్టి అద్భుతమైన కార్యక్రమం  అని ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని బద్వేలు రెవిన్యూ డివిజనల్ అధికారి ఆకుల. వెంకటరమణ అన్నారు.  భారత ప్రభుత్వ కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ ,నెహ్రూ యువ కేంద్ర,హెచ్.ఎ.ఆర్.డి‌.ఎస్. సంస్థ ఆధ్వర్యంలో బద్వేలు పట్టణంలో  నా దేశం నా మట్టి కార్యక్రమం బద్వేలు నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించారు. విద్యార్థులు, యువత  జాతీయ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ బారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో  మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ నా దేశం నా మట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.ఇలాంటి అధ్బుతమైన కార్యక్రమాన్ని రూపొందించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మనమందరం ధన్యవాదాలు తెలిపాలని అన్నారు. భారతదేశ చరిత్ర ,సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో ఘనమైనవి అని చెప్పారు.  నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి కె.మణికంఠ మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి సేకరించిన మట్టిని ఢిల్లీలోని  అమృత్వాటిక స్మృతి వనం ఏర్పాటు చేస్తారని తెలిపారు.

ఈనెల 31వ తేదీన ఈ కార్యక్రమం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తారని చెప్పారు.  ప్రతి మండలం నుండి ఒకరు ఢిల్లీకి వెళతారని,కడప నుంచి కూడా వెళతారని తెలిపారు.ఎన్సిసి కమాండెంట్ ఆఫీసర్ వినయ్ రామచంద్ర మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారని వారందరిని స్మరించుకోవాలని సూచించారు.మాజీ సైనికులు శ్రీనివాసులు, పెంచలయ్య లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఎంపీడీవో నూర్జహాన్, నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, హెచ్.ఏ.ఆర్. డి.ఎస్ సొసైటీ అధ్యక్షులు ఎర్రంపల్లి రవి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie