యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవ వేడుకలు
పెద్దపల్లి
తెలంగాణ యూట్యూబర్స్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మారం తిరుపతి యాదవ్, బత్తుల లక్ష్మయ్య యాదవ్, అమరేందర్, దయానంద్ గాంధీ, మ్యాజిక్ రాజా హాజరయ్యారు. జిల్లాలోని ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున విశిష్ట కళా సేవలు అందించిన వారి కళా నైపుణ్య ప్రతిభకు గాను అసోసియేషన్ నాయకులు సన్మానించి, ప్రశంస పత్రాలు అందజేశారు. కళలను, కళాకారులను ప్రోత్సహిస్తూ భావితరాలకు అందించాలనే సంకల్పంతో యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు మంద భాస్కర్ యాదవ్, పసులేటి సదయ్య, బడిగల గణేష్ తెలిపారు. కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు దామర శంకరయ్య, జిల్లా అధ్యక్షులు కొమ్ము కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కంది సంపత్, కార్యనిర్వాహక అధ్యక్షులు సాదుల శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు బుర్ర గడ్డ రవికుమార్ గౌడ్, వ్యవస్థాపక సభ్యులు అనిల్ కుమార్, ఎండి బాబా, అట్ల సతీష్, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.