Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రామగిరి ఖిల్లాపై సాహితీ స్నేహయాత్ర

0

కమాన్ పూర్

నిత్యం విధినిర్వహణలో తీరిక లేకుండా గడిపే అధికారులు రామగిరి ఖిల్లా ప్రకృతి రమణీయ ప్రదేశాన్ని సంధర్శించి   ఉల్లాసంగా గడిపారు.పెద్ధపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ ఆధ్వర్యంలో అధికారులు  రామగిరి సాహితి స్నేహయాత్ర-3 పేరిట పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలంలోని రామగిరి ఖిల్లాను సందర్శించారు.ఈ సధర్భంగ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు చెందిన దాదాపు 150 మంది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు,కవులు కళాకారులు,రచయితలు, పెద్ద పల్లి జిల్లాకు చెందిన టీం లీడర్స్ సట్టు కనుకయ్య ,జ్యోతి కవులు కూచన మల్లయ్య మహర్షి, నూనెరాజేశం, బియ్యని తిరుపతి, తదితర కవులు రామగిరి ఖిల్లాను సందర్శించారు, ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు సహసయాత్ర కొనసాగింది.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి అధనపు జిల్లాకలెక్టర్ తో పాటు మంథిని ఆర్డీవో హనమ నాయక్ తదితరులు ఖిల్లాపై శత్రుదుర్భేద్యమైన పురాతన కోటలు,కట్టడాలు ప్రకృతి సౌందర్య ప్రాంతలను సందర్శించారు.బేగంపేట గ్రామ శివారు నుంచి కాలినడకన ఖిల్లాను ఎక్కుతూ అద్భుతమైన కట్టడాలు దర్వాజలు, బురుజులు, శిల్పాలు, కొలనులు తిలకించా రు.చవరిగా ఖిల్లాపై శ్రీ సీతారామ చంద్రులను దర్శించుకుని తిరిగి రత్నాపూర్ నుండి కిందకు దిగారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie