భద్రాద్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని టేకులపల్లి మండలం 6వ మైల్ తండా ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా… ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారి వివరాలు చూసుకుంటే టేకులపల్లి మండలంలోని రోళ్లపాడుకు చెందిన పొదేం సంతోష్(22), మడి నాగరాజు (20), టేకులపల్లి మండలంలోని లచ్చ తండాకు చెందిన బానోత్ లక్ష్మణ్ (30)గా పోలీసులు గుర్తించారు. ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు అన్న విషయం తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఆసుపత్రి వద్దకు చేరుకొని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ చేశారు.