కర్నూలు, సెప్టెబర్ 18, (న్యూస్ పల్స్)
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఇటీవల వీధి కుక్కలు మరియు పిచ్చి కుక్కలు దాడులు ఎక్కువ అయ్యాయి.. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ వారు పలు అనారోగ్యం కు గురైన ట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం తాజాగా ఆలూరు మండలం హత్థిబేలగల్ గ్రామంలో ఇంటి ముందు ఆడుకొంటున్న హుస్సేన్ అనే ఆరు ఏళ్ల బాలుడు ని రెండు కుక్కలు స్వైర విహారం చేసి తీవ్రంగా గాయపరచాయి. గాయపడ్డ బాలుడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆలూరు నియోజకవర్గ పరిధిలోని ఆయా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 6నెలల నుంచి ఇప్పటి వరకు 48 మంది కుక్క కాటుకు గురి అయ్యారు. వారందరు వివిధ చికిత్స పొంది ఎప్పుడు తాము అనారోగ్యం బారిన పడుతామోనని ఆందోళన చెందుతున్నారు…గ్రామాల్లో వివిధ రకాల వల్ల కుక్క కాటుకుగురైన వారికి స్థానిక ఆసుపత్రుల్లో వివిధ రకాల మందుల కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఆలూరు, అలాగే హాలగుంద, ఆస్పరి, హాలహర్వి, చిప్పగిరి దేవనకొండ మండల కేంద్రల్లో కుక్క కాటుకు గురైన భాదితులకు యాంటీ రాబిన్ వ్యాక్షన్ అందుబాటులో ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (ARV) అరకొరగా ఉన్నట్లు తెలుస్తోంది.. గ్రామీణ ప్రాంతాల్లో కుక్క కాటుకు గురైన వారు వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందే పరిస్థితి నెలకొంది..గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కలు కాటు వేసిన కొందరు తమను పిచ్చి కుక్కలు కాటు వేసి నట్లు ఆందోళన చెందుతున్నారు.. వారు వివిధ రకాల మందులు వాడటం వల్ల లేని పోని ఇబ్బందులు పడుతున్నారు.కుక్క కాటు కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందే వారిలో కొందరు తమను పిచ్చి కుక్కలు కాటు వేసాయని వైద్యులకు చెబుతున్నారు.. వైద్యులు వారిని స్థానిక ఆసుపత్రుల్లో ఏ మందులు ఇవ్వాలో తెలియక సరైన చికిత్స లు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. అయితే పిచ్చి కుక్క కాటు కు తాము గురైనట్లు ఆందోళన చెందే వారు తమను కాటు వేసిన కుక్క ను ఎన్ని ఇబ్బందులైన ఆ కుక్క ను బంధించాలి.
స్థానిక పశు వైద్యాధికారి దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. కాటు వేసి న కుక్క మంచిదా.. లేదా.. పుచ్చిదా.. అనే విషయాన్ని స్వయంగా తెలుసుకో ని మందులు వాడాలి.. లేదంటే.. లేని పోని మందులు వాడటం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది..తమను పిచ్చి కుక్కకాటు వేసినట్లు కొందరు డాక్టర్ లతో చెబుతున్నారు.. ఆందోళన చెందుతున్నారు..అలాంటి వారి కి కనీసం. నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఆసుపత్రిలో కూడా IG ( ఇమినోగ్లోబిలేషన్ ) వ్యాక్షిన్ అందుబాటులో ఉండడం లేదు.. పిచ్చి కుక్క కాటు కు గురైన వారు కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందే పరిస్థితి నెలకొంది.