Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రేషన్ వినియోగదారుల కు ముఖ్యమైన సమాచారం…ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్ ఈకేవైసీ చేయించుకోవాలి….

0

కమాన్ పూర్

రేషన్ కార్డు లో నమోదైయున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు వారి యొక్క ఆధార్ కార్డుకు రేషన్ కార్డులో ఉన్న తమ పేరును  అనుసంధానం   కావడానికి    ( ధ్రువీకరణ ) ఈకేవైసీ చేయించుకోవాలి అని కమాన్ పూర్ తహసిల్దార్ మోహన్ రెడ్డి తెలిపారు.మీ దగ్గర లో ఉన్న రేషన్ షాపుకువెళ్లి మీ వెలిముద్ర లేదా ఐరిష్ తో మీ ఆదార్ కార్డును అనుసంధానం చేసుకోకపోతే మీ పేరు పైన వచ్చే బియ్యం నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి.కావున వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరు ఈకేవైసీ  చేయించుకోవాలి అని కమాన్ పూర్ తాసిల్దార్ మోహన్ రెడ్డి కోరారు.

1) మా ఇంట్లో 5 మందిమి ఉన్నాము  కార్డులో ఉన్న ఎవరమైన ఒకరము వచ్చి వేలి ముద్ర వేస్తే సరిపోతుందా*……
@ కాదు కార్డులో నమోదైయున్న ప్రతి కుటుంబసభ్యుడు కచ్చితంగా రేషన్ షాపుకు వచ్చి వేలిముద్ర లేదా ఐరిష్ ఇవ్వాల్సి ఉంటుంది

2) మా కార్డులో పేర్లు ఉన్న. అయిదు మందిలో ప్రస్తుతం ఇద్దరమే ఉన్నాము ,మిగతా ఇద్దరు బ్రతుకు. దెరురువుకొరకు బొంబాయి మరియు హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లినారు ,మరి వారు వేలి ముద్ర వేయకపోతే బియ్యం ఆగిపోతాయా?…
అలాంటిదేమి లేదు ,తెలంగాణ రాష్ట్రంలో మీకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపుకైనా వెళ్లి మీ కార్డు నంబర్ చూయించి అందులోని మీ పేరును తెలిపి వెలిముద్ర ఇచ్చి ఈకేవైసీ  పూర్తి చేసుకోవచ్చు.
అయితె మీ పేరు నమోదైన షాపులో ఈకేవైసీ  చేయించుకోవడం ఉత్తమం , ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు, వారు వచ్చినప్పుడు వెలిముద్ర ఇచ్చి ekyc చేయించుకోవచ్చును.

3) మా ఇంట్లో ఇంకా నలుగురు  పిల్లల యొక్క  పేర్లు,, కొడుకులు /కూతుర్లు పేర్లు రేషన్ కార్డులో లేవు మరి వారి పరిస్థితి ఏంటి?*……
ఇట్టి ఈకేవైసీ   అందరివి పూర్తి స్థాయిలో అయిపోయిన తరువాత అట్టి వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కావున రేషన్ కార్డులో పేరు లేని వారిని రేషన్ షాపుకు తీసుకురావాల్సిన అవసరం లేదు..

4) మా కోడలు పేరు వారి పుట్టింటి ఊరిలో ఉంది ,ఇక్కడ ఈకేవైసీ  చేయించుకోవచ్చా*
వారి పుట్టింటి ఊరిలో వీరి పేరు రేషన్ కార్డులో నమోదై ఉంటే  అక్కడి కార్డు నంబర్ వ్రాసుకొని వచ్చి  ఇక్కడకూడా ఈకేవైసీ  చేయించుకోవచచ్చు ఒకవేళ వీరి పేరు   కార్డులో తొలగించికొని ఉంటే అక్కడ గాని, ఇక్కడగాని, ఈకేవైసీ  చేయించుకోవడానికి రాదు

5) ఇట్టి ఈకేవైసీ  చేయించుకోవాడానికి రేషన్ షాపులో డబ్బులేమైన చెల్లించవలేనా*…
అలాంటిదేమి లేదు ఇట్టి పనిని పూర్తిగా ఉచితంగా నే చేయబడును..

6)  రేషన్ షాపుకు కుటుంబసభ్యులు అందరు ఒకేసారి వచ్చి ఈకేవైసీ  చేయించుకోవాలా*…
అందుబాటులో ఎవరు ఉంటే వారు ఈకేవైసీ   చేసుకోవచ్చు,కాకపోతే షాపుకు వచ్చే ప్రతి ఒక్కరు తమ రేషన్ కార్డు లేదా కార్డు  తీసుకరావలసి ఉంటుంది లేదా కార్డు నంబర్ వ్రాసుకు రావాలి..

7) మా ఇంట్లో కొందరివి వేలిముద్రలు కానీ కనుపాప కాని స్కాన్ కావడం లేదు వారి పరిస్థితి ఏమిటి*…..
దగ్గర లో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్లి వేలి ముద్ర /కనుపాప ఇచ్చి మీ ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకున్న తరువాత రేషన్ షాపుకు వచ్చి ఈకేవైసీ  చేయించుకోవాలి,అక్కడ కూడా ఆదార్ నంబర్ కు అనుసంధానం కాకపోతే  అట్టి వాటిపై  ప్రభుత్వం ఏదైనా మార్గదర్శకాలు ఇవ్వవచ్చు ,వేచిచూడాలి
ఇట్టి ఈకేవైసీ  ని రేషన్ షాపుల పని దినాలలో షాపులు తెరచివుంచిన  సమయంలో ఎప్పుడైనా ,ఎక్కడైనా చేయించుకోవచ్చు..
మీకు ఇట్టి ఈకేవైసీ  చేయించుకోవడంలో ఇంకెలాంటి సందేహాలున్న సంబంధిత తహసీల్దార్ ని గాని ,మీ స్థానిక డీలర్ ను గాని సంప్రదించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie