నల్గోండ
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్లు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ మీద నకిరేకల్ నుంచి నల్లగొండ వెళుతున్న భార్యాభర్తలను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త మహేష్ స్పాట్ లోనే మృతి చెందగా , భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి ట్రీట్మెంట్ జరుగుతుండగానే ఆమె కుడా చనిపోయింది. వీరిద్దరూ నెల రోజుల కిందటే ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. మృతులు కేతపల్లి మండలం, గుడివాడ కు చెందిన చిత్తలూరు మహేష్(22), రిషితగా (17) గుర్తిoచారు .ఇరువురి మరణంతో రెండు కుటుంబాల్లో విషాధ ఛాయలు అలుమకున్నాయి..