నెల్లూరు
నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం పున్నురు రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది,3వ మైలు ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంలో మైపాడుకు వెళుతుండగా మైపాడు నుండి నెల్లూరు వైపు వస్తున్న ఆటో బైక్ ను ఢీ కొట్టినట్టు ఈ ప్రమాదంలో ఇద్దరు సాదిక్ (21), అనిల్ (21) అక్కడికి అక్కడే మృతి చెందగా మరొక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని నెల్లూరు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.బైక్ ను ఢీ కొట్టిన ఆటో పరారైనట్లు సమాచారం.