విజయవాడ
గురుగోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన లాయర్ లాయర్ సిద్దార్ద్ లూధ్రాపై పిర్యాదు నమోదయింది. మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసును వాదిస్తున్న సుప్రీం కోర్టు అడ్వకేట్ ల్ సిద్దార్థ లుత్రా పై రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు పిర్యాదు చేసారు. న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కనుచూపు మేరలో కనిపించనప్పుడు కత్తి అనే ఆయుధం పట్టాల్సిందే అని ట్విట్టర్ లో చేసిన కామెంట్ హింసను ప్రేరేపించేలా ఉందని, దీనిని సుమోటోగా తీసుకుని సిద్దార్థ లుధ్రా పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే పిర్యాదు చేసారు.