వర్షాకాలంలో పత్తి పంట లో నీటినిలువపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
కమాన్ పూర్
భారీ వర్షాల వల్ల పత్తి పంటల్లో నీరు నిల్వ ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ మండల విస్తరణ అధికారులు సురేష్ నాయక్ యాదగిరి శ్రీనివాసులు తెలిపారు.
ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలకు మొక్క వేర్ల వద్ద నీరు నిలిచి ఉండి ఆక్సీజన్ శాతం తగ్గిపోయి వేర్ల శ్వాసక్రియ
రేటు మందగించి పోషక పదార్థాలను సరిగ్గా గ్రహించక పోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది అని పేర్కొన్నారు. అంతేకాకుండా మొక్క యొక్క రోగ నిరోధక శక్తి తగ్గి చీడపీడల సమస్యలు ఉత్పన్నమై పంట దిగుబడులు తగ్గిపోతాయి.
ఈ నేపథ్యంలో ముందుగా వర్షపు నీటిని బయటకు పంపించి నివారణ చర్యలను చేపట్టటం ద్వారా ఎరువుల వినియోగం
సామర్థ్యం పెరుగుతుంది. ఒకవేళ వర్షపు నీటిని బయటకు పంపించలేని పరిస్థితులలో మొక్కలకు పైపాటుగా పోషకాలను | అందించవచ్చును. ఇందుకోసం యూరియా 20 గ్రా. లేదా పొటాషియం నైట్రేట్ (13-0-45) 10 గ్రా. లేదా 19-19-19 10 గ్రా. ను లీటరు నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి అని పేర్కొన్నారు…
అలాగే ఇనుపధాతు లోప నివారణకు 2.0 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్, జింకు ధాతు లోప నివారణకు 2.0 గ్రా. జింక్ సల్ఫేట్, మెగ్నీషియం లోప నివారణకు 10 గ్రా. ల మెగ్నీషియం సల్ఫేట్, బోరాన్ లోప నివారణకు 1.5 గ్రా. బోరాక్స్ ను లీటరు
నీటికి కలిపి సది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి.
వర్షాలు తగ్గాక ముందుగా కలుపు నివారణ కోసం క్విజాలోఫాస్ ఇథైల్ 400 మి.లీ + పైరిథియోబాక్ సోడియం 250 మి. లీ ను 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఒక ఎకరానికి పిచికారి చేసుకోవడం ద్వారా పొలంలోని గడ్డిజాతి
మరియు వెడల్పాకు కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు అని పేర్కొన్నారు.
ఇప్పుడు పూత మరియు కాయ దశలో ఉన్న ప్రతి పంటకు 20-25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులను
మొక్కలకు 5-6 సెం.మీ దూరంలో వేసుకోవడం ద్వారా పూత మరియు మొగ్గ రాలడం ను కొంతమేర అరికట్టవచ్చును అని పేర్కొన్నారు