Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వారాహి యాత్రలో టీడీపీ, జనసేలు

0

విజయవాడ, సెప్టెంబర్ 27, (న్యూస్ పల్స్)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి వారాహి యాత్రకు సిద్దమవుతున్నారు. అక్టోబర్ 1 నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర సాగనుంది. ఇప్పటికే మూడు విడతల యాత్ర పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్.. కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఈ సారి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మొదటి 3 విడతల యాత్రలో కేవలం జనసేన పార్టీ బలోపేతం, ఓటింగ్ శాతం పెంచుకోవడం పైనే పవన్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కానీ చంద్రబాబు అరెస్ట్, జైలుకి వెళ్లిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. చంద్రబాబుతో ములాఖత్ కోసం వెళ్లిన పవన్ కళ్యాణ్ అనూహ్యంగా పొత్తులపై స్పష్టత ఇచ్చేసారు. తెలుగుదేశం పార్టీతో కలిసే ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించారు.

దీంతో జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా పవన్ నిర్ణయం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే పొత్తుల ప్రకటన తర్వాత యాత్ర స్వరూపం ఎలా ఉంటుందనే చర్చ మొదలైందిసుమారు 40 రోజుల విరామం తర్వాత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. మొదటి విడత వారాహి యాత్రను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముగించగా.. రెండో విడతలో ఏలూరు నుంచి యాత్ర ప్రారంభించి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముగించారు. అలాగే మూడో విడత వారాహి యాత్ర విశాఖ పట్నంలో కొనసాగింది. మూడు విడతల యాత్రలో కూడా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. ఒక వైపు సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు చేస్తూనే స్థానిక ఎమ్మెల్యేల అవినీతి టార్గెట్‌గా పవన్ యాత్ర కొనసాగింది.

స్థానిక సమస్యలపై ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆయా నియోజకవర్గాల పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్ఠీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై దిశానిర్ధేశం చేసారు. ఇక మూడో విడతలో విశాఖపట్నంలో రెండు మాత్రమే బహిరంగ సభలు నిర్వహించారు. కానీ విశాఖపట్నంలో ఉన్న ప్రధాన సమస్యలపై క్షేత్రస్థాయి పర్యటనలు చేసారు పవన్. రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించి ప్రభుత్వంపై విమర్శలు చేసారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభాని కంటే ముందున్న పరిస్థితికి ఆ తర్వాత పార్టీ పరిస్థితికి చాలా మార్పు వచ్చిందని జనసేన నేతలు చెబుతున్నారు. కానీ మొదటి 3 విడతల యాత్రకు నాలుగో విడత యాత్రకు ఎంతో మార్పు కనబడనుంది. ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలతో పవన్ యాత్రపై ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పవన్ నాల్గో విడత టూర్ సాగనుంది. మచిలీపట్నం కేంద్రంగా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పర్యటనలకు పవన్ వెళ్లనున్నట్లు తెలిసింది. కృష్ణా జిల్లాలో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే అవనిగడ్డ, మచిలీపట్నం, పెడనతో పాటు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గంలో పవన్ పర్యటన సాగనుంది. నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీలో కీలక నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie