Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

విద్యుత్ డిజిటల్ చెల్లింపులపై అపోహలు వద్దు

టి.విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 జిల్లా కార్యదర్శి ఎన్. రాంజీ నాయక్

0

జగిత్యాల

విద్యుత్తు వినియోగదారులు డిజిటల్ చెల్లింపు పై ఎలాంటి అపోహలు పడవద్దని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 జిల్లా కార్యదర్శి ఎన్ రాంజీ నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ప్రాంతంలో విద్యుత్ వినియోగదారులకు బిల్లుల చెల్లింపులపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిజిటల్ విధానాల్లో మీ విద్యుత్ బిల్లులు చెల్లించినట్లయితే మీ విలువైన సమయం వృధా కాకుండా ఉంటుందని అన్నారు.

అంతే కాకుండా డిజిటల్ ద్వారా బిల్లు చెల్లించగానే అప్డేట్ అవుతుందని దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని అన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించి మెరుగైన విద్యుత్తును పొందటానికి సంస్థకు సహకరించాలని వారు కోరారు..కలెక్షన్ సెంటర్ లోనే బిల్లు చెల్లించడానికి వచ్చినట్లయితే వినియోగదారుల సమయం వృధా అవుతుందని దానికి ప్రత్యామ్నాయంగా ఫోన్ పే, గూగుల్ పే లాంటి డిజిటల్ చెల్లింపులను వినియోగించుకోవాలని వినియోగదారులను కోరారు.ఈ కార్యక్రమంలో ఏవో భూమేష్ ,జేఏవో రాజేశం, ఎల్.ప్రకాష్, రమేష్, సుధాకర్ ,ఎండి తాప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie