Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వీర వనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ

0

పెద్దపల్లి

 వీర వనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ తో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అరుణ శ్రీ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ సంఘ సేవకురాలుగా, భూమి, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పోరాట పటిమతో వీర వనితగా చరిత్రలో నిలిచి, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారని, ఆమె ఆశయాలను నేటి తరం వారు కొనసాగించాలని తెలిపారు. సమాజహితం కొరకు పోరాడిన మహనీయుల స్ఫూర్తి, వారి త్యాగాలు, గొప్పతనం ప్రజలకు తెలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచి, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని, మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అటువంటి వీర వనితను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ మాట్లాడుతూ,  గతంలో చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహనీయుల గురించి తెలిసేది కాదని, భవిష్యత్తు తరాలకు మహనీయుల ఆశయాలు వారు చేసిన పోరాటాల గురించి తెలియజేసేందు కు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తుందని అన్నారు.

చాకలి ఐలమ్మ ఒక కులంలో పుట్టడం వల్ల  ఎదగలేదని తను పోరాట పటిమ వల్ల ఎదిగిందని, ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలకు అన్ని వర్గాలకు చెందిన వారు స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేయాలని, పండుగలా కార్యక్రమాన్ని నిర్వహించాలని, మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జే.రంగా రెడ్డి, రజక సంఘ నాయకులు,రజక సంఘం సభ్యులు శ్రీనివాస్, అశోక్, శంకర్, జిల్లా అధికారులు, బి.సి. జాతీయ సంఘ నాయకులు శ్రీమాన్, బి.సి., రెడ్ క్రాస్ సభ్యులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie