Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వృద్ధులను వేధిస్తే  చర్యలు తప్పవు : జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్

0

జగిత్యాల
వయోవృద్ధులపై దాడులు చేసినా, వేదింపులకు గురిచేసిన వారిపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం  చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్  అన్నారు.మంగళవారం  జిల్లా,డివిజన్ మండలాల,జగిత్యాల పట్టణతెలంగాణ ఆల్ సీనియర్   సిటీజన్స్ అస్సోసియేషన్ ప్రతినిధులు జిల్లా సంక్షేమ అధికారిని కలిశారు.జగిత్యా జిల్లా సంక్షేమ అధికారిగా బదిలీ పై  వచ్చి  భాస్కర్  బాధ్యతలు తీసుకున్న సందర్భంగా సీనియర్ సిటీజన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా,డివిజన్,మండల, జగిత్యాల పట్టణ సీనియర్  సిటీజేన్స్ ప్రతినిధులు పుష్ప గుచ్చాలతో స్వాగతించి  శుభాకాంక్షలు తెలిపి పట్టు శాలువాలతో  సత్కరించారు. వయో వృద్ధుల చట్టం అవగాహన,పిలుపు పుస్తకాలను జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ కు  జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ బహుకరించారు.ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ సీనియర్ సిటీజన్స్ సమస్యలు సంక్షేమ అధికారి దృష్టికి తెచ్చారు.

అవనిగడ్డ లో టెన్షన్

అధికారి  భాస్కర్  వెంటనే స్పందించి మాట్లాడుతూ  జగిత్యాల జిల్లాలో  సీనియర్ సిటీజన్స్ ను వేధింపులకు,నిరాదరణకు  గురవుతున్న  తల్లిదండ్రుల ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష , జగిత్యాల,కోరుట్ల,మెట్ పల్లి ఆర్డీవోల దృష్టికి జిల్లా సీనియర్ సిటీజేన్స్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో  సత్వరం తీసుకు వస్తున్న, తగు కౌన్సెలింగ్ చేస్తున్న  జిలా,డివిజన్ల ,మండలాల సీనియర్ సిటీజేన్స్ ప్రతినిధులను జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ అధికారిగా తాను నిర్వహించే శాఖలకు  అంకిత భావ సేవలు అహర్నిశలు అందిస్తానని భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అల్   సీనియర్ సిటీజన్స్  రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, జిల్లా ప్రధాన  కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కోశాధికారి వి.ప్రకాష్,ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.ఆశోక్ రావు,సంయుక్త కార్యదర్శులు రాజ్ గోపాల చారి, యాకూబ్ హుస్సేన్,జగిత్యాల పట్టణ అధ్యక్షుడు పి.సతీష్ రాజు, కార్యదర్శి మానాల కిషన్,మెట్ పల్లి డివిజన్ సీనియర్ సిటీజన్స్ అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,ఎఫ్.ఆర్ ఓ.కొండయ్య,ఆఫీసు పర్యవేక్షకుడు చంద్రమోహన్,జిల్లా, డివిజన్ మండల,పట్టణ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie