Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వైసీపీలో ధీమా…భ్రమా…

0

నెల్లూరు, అక్టోబరు 30 

నాలుగున్నరేళ్ల పాలన తర్వాత కూడా వైసీపీ క్షేత్ర స్థాయి క్యాడర్ఆక్రోశం వీడలేదు. పార్టీ అధికారానికి వచ్చినప్పటి నుంచి తమపట్ల నిర్లక్ష్యం కొనసాగుతుందనే ఆవేదనకు ఫుల్ స్టాప్పడలేదు. ప్రభుత్వానికి వలంటీర్లే కళ్లూ చెవులు అన్నట్లు వ్యవహరించడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామ స్థాయి నాయకులను పట్టించుకోవడం లేదని మథనపడుతున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీలను దగా చేశారని సర్పంచులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.ఐదేళ్ల కిందటిదాకా పార్టీ జెండా మోసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న క్షేత్ర స్థాయి నాయకులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ అధికారానికి వచ్చాక తమను అసలు పట్టించుకోలేదని నాయకత్వానికి దూరంగా జరిగారు. ప్రభుత్వం వలంటీర్లపైనే దృష్టి పెట్టి పార్టీ క్యాడర్‌ను గాలికొదిలేసిందని నిర్మొహమాటంగా చెబుతున్నారు.నాలుగేళ్లపాటు అసలు పార్టీ సమావేశాలే సక్రమంగా జరగలేదు.

చిన్న చిన్న కాంట్రాక్టులు, పనులు దక్కించుకున్న ద్వితీయ శ్రేణి నేతలకు బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్లు కూడా అసంతృప్తితో ఉన్నారు. కొందరు అసలు పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా మొహం చాటేస్తున్నారు.ఇన్ని ఇబ్బందులున్నా.. వాటిని పరిష్కరించకున్నా వైసీపీ అధిష్టానం గెలుపు ధీమానే వ్యక్తం చేస్తోంది. సీఎం జగన్దగ్గర ఏదైనా అల్లాఉద్దీన్అద్భుతదీపం ఉందా అంటూ విపక్ష నేతలు సెటైర్లు విసురుతున్నా డోంట్కేర్అంటున్నారు. ప్రజలు ఎలా తీర్పునిస్తారనేది ఎన్నికలదాకా వేచి చూడాల్సిందే.సీపీఎస్రద్దు చేయకపోగా ఒకటో తేదీ జీతాలు వేయడం లేదని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరవుతో రైతుల్లో నైరాశ్యం అలుముకుంది. నానాటికీ పెరుగుతున్న భారాలతో మధ్య తరగతి, పేదల బతుకులు మరింత కష్టంగా మారాయి. ఎన్ని సమస్యలున్నా సరే.. మళ్లీ గెలిచేది తామేనంటూ వైసీపీ నేతల్లో ధీమాకు కారణం ఏమై ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.గతంలో సంక్షేమ పథకాలు కొన్ని సామాజిక వర్గాలకే కొంతమేరకే అందేవి. వాటిలోనూ పైరవీలు, లంచాలకు కొదవ లేదు.

సంక్షేమ శాఖల కార్యాలయాలు దళారులకు అడ్డాగా విలసిల్లేవి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ కార్పొరేషన్ల వైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా చేశారు. స్వయం ఉపాధి పథకాలు రద్దు చేశారు.వెల్ఫేర్శాఖల నిధులను నవరత్నాలకు మళ్లించారు. దళారులు, సిఫారసులతో పన్లేకుండా అర్హులైన లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నారు. వివిధ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికీ వ్యక్తిగత లబ్ది చేకూర్చారు. ఇలా చేయడం వల్లే పార్టీని మళ్లీ గెలిపిస్తారని వైసీపీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు.సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో మునుపెన్నడూ లేనంతగా చైతన్యం కనిపిస్తోంది. గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట ప్రతి కుటుంబానికీ ఏటా ఏమేరకు లబ్ది చేకూరిందో వివరాలతో సహా నాయకులు వెల్లడిస్తున్నారు. అదే సమయంలో తమ బతుకులు మరింత దుర్భరంగా ఎందుకు మారాయనేది వాళ్లకు అర్థమైంది. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్‌తో పాటు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి.

కరెంటు, రవాణా చార్జీల మోత భరింపశక్యం కాకుండా ఉంది.మద్యం ధరలతో పాటు ఇంటి పన్నులు, అద్దెలు పెరిగాయి. ఐదేళ్ల క్రితం ఓ సామాన్యుడి పొదుపు నెలకు రూ.5 వేలుంటే.. ఇప్పుడు ఆదాయం సరిపోక నెలాఖరుకు అప్పులు చేయాల్సి వస్తున్నదని గుండెలు బాదుకుంటున్నారు. ఈ వాస్తవాన్ని అధికార పార్టీ నేతలు గుర్తించారా? లేక, గమనించినా ఆల్ఈజ్ వెల్ అంటూ జబ్బలు చరుచుకుంటున్నారో అర్థం కావడం లేదని విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.సీపీఎస్రద్దు చేయలేదని.. మొదటి తేదీన జీతాలు ఇవ్వడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము దాచుకున్న పీఎఫ్సొమ్ములు, అరియర్స్కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. గ్రామ సర్పంచులైతే తమకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆగ్రహంతో రగిలిపోతున్నారు.సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. ఈఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కౌలు రైతులైతే తమను పెనం మీద నుంచి పొయ్యిలోకి తోశారంటూ ఆక్రోశిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie