Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వైసీపీ మూకల చేస్తున్న దాడులు, అరాచకాలు దౌర్జన్యాలపై గవర్నర్ కు ఎన్డీఏ నేతల ఫిర్యాదు…..

ఓడిపోతున్నామని భయంతోనే జగన్ రెడ్డి చేయిస్తున్న దాడులు ఇవి ఇన్ని అరాచకాలు జరుగుతున్న చోద్యం చూస్తున్న పోలీసులు ఐదేళ్ల హింస రాజకీయానికి ప్రజలు స్వస్తి చెప్పారు దాడులు దౌర్జన్యాలను ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, శాంతి పద్ధతులను పునరుద్ధరించాలి -ఎన్డీఏ నేతలు

0

అమరావతి రెండు రోజులుగా రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడులు దౌర్జన్యాలు అరాచకాలపై గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి ఫిర్యాదు చేసిన కూటమి నేతలు. ఓడిపోతున్నామని భయంతోనే అధికార వైసిపి ఈ దాడులు చేయిస్తుందని గవర్నర్ కు కూటమి నేతలు తెలియజేశారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నశించిపోయిన శాంతి భద్రతలను తిరిగి పునరుద్ధరించాలని కూటమి నేతలు గవర్నర్ ను కోరారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ…. వర్ల రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వ అరాచకాలనీ ఎదుర్కొని ఒటు హక్కును వినియోగించుకున్నవారందరికి కూటమి తరపున కృతజ్ఞతలు. రాష్ట్రంలో నశించిన శాంతిభద్రతలు, ప్రభుత్వ దౌర్జన్యాలు, మా పై జరిగిన అరాచకత్వాన్ని గవర్నర్ కు వివరించాం. పోలీసులు, పోలీసు అధికారులు  వ్యవహరించిన తీరు గురించి చెప్పాం. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, పూతలపట్టు, నరసరావుపేట ఇలా అనేక చోట్ల పోలీసులు వైకాపాతో మిలాఖాత్ అయి టీడీపీ నాయకులపై, ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేశారు. వీటన్నిటిపైనా చర్యలు తీసుకోవాలి అని గవర్నర్ ను కోరాము. రాడ్లు, కర్రలు, పెట్రోల్ క్యాన్లతో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా తిరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఆధారాలతో సహా గవర్నర్ కు సమర్పించాం. గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారు. పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకం సినిమాలను తలపించేలా ఉన్నాయి. కళ్ళకు కట్టినట్లుగా గవర్న్ గారికి చూపించాం. వైసీపీకి ఓటు వేయలేదా కొట్టండి అని, వీడు మన పార్టీ కాదు కొట్టండని వైసీపీ మూకలు దాడులు చేశారు. వాళ్ళు చేసిన దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. వీరి దౌర్జన్యాలు చూస్తుంటే మనం భారతదేశంలో ఉన్నామా లేక ఇస్లామిక్ దేశంలో ఉన్నామా అని అనుమానం కలుగుతోంది. చంద్రగిరిలో పులివర్తి నాని ని కొట్టి చంపడానికి ప్రయత్నించారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇష్టం వచ్చినట్లు వ్యవహారించాడు. వీటన్నింటిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇలాంటివి జరగకుండా చూస్తానని కూడా గవర్నర్ హామీ ఇచ్చారు. గవర్నర్ చాలా సౌమ్యంగా వ్యవహరించారు. ఆయన దృష్టికి ఇలాంటివి అనేకం వచ్చినట్లు చెప్పారు.  అసమర్ధ పోలీసుల పైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అధికార పార్టీతో ఎవరు లాలూచీ పడ్డారో, చేతులు కలిపారో ఆ పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని గవర్నర్ అన్నారు. ఎవరైతే ఎన్నికల విధులను లోపభూయిష్టంగా వ్యవహరించారో వారందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన హామీ ఇవ్వడంతో మేము చాలా సంతోషించాం జగన్మోహన్ రెడ్డి ఆటలు ఇక సాగవు” అని వర్ల హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie