Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వ్యవస్థలను మేనేజ్ చేసారు చంద్రబాబును అరెస్టు చేసారు

0

రాజమండ్రి

చంద్రబాబు ఏ తప్పు చేయకపోయినా బంధించి  50 రోజులు అయ్యింది. గతంలో రాజకీయ కక్షలుండేవి, ఇప్పుడు వ్యక్తిగత కక్షసాధింపు ఏపీలో కనిపిస్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆన్నారు. శనివారం అయన రాజమండ్రి జైలులో వున్న చంద్రబాబును కలిసిన తరువాత మీడియాతో మాట్లాడారు. వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబును చావు కోసం, చంపేయడం కోసం చూస్తున్నారు. కేసుకు ఎలాంటి సంబంధం లేని మా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైసిపి మహిళా మంత్రి చెబుతున్నారు.

చంద్రబాబును అరెస్టు చేసి 50 రోజుల్లో ఏం పీకారని అన్నారు. ఒక కొత్త ఆధారమైన ప్రజల ముందు పెట్టారా? స్కిల్  కేసులో గానీ, ఇన్నరింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ఎక్కడైన నగదు వచ్చిందని ఒక్క ఆధారమైన బయటపెట్టిందా ప్రజలు ఆలోచించాలి. పార్టీ అకౌంట్ కూడా ఒక్క రూపాయి రాలేదు. ఒక్క సెంటర్ కూడా మూయలేదని స్కిల్ డవల్మెంట్ కార్పొరేషన్ అజయ్ రెడ్డి చెప్పారు. మొదటి రోజు నుండి చెబుతున్నాం చంద్రబాబు ఏ తప్పు చేయలేదు. మా అకౌంట్స్ కూడా పదేళ్లుగా ప్రజల ముందు పెట్టాం.

మీకు దమ్ము, దైర్యం ఉంటే ఆధారాలు ప్రజల ముందు పెట్టండి. మా తల్లి నిజం గెలవాలని ప్రజల్లోకి వెళ్తే అరెస్టు చేస్తామని మహిళా మంత్రి అంటుంటే ఇది వ్యక్తిగత కక్షేకదా అని నిలదీసారు. స్కిల్ డవల్మెంట్ కేసులో చంద్రబాబుకు గానీ, మా కుటుంబ సభ్యులుగానీ ఎలాంటి సంబంధం లేదు. సైకో జగన్ వ్యవస్థలను మ్యానేజ్ చేసి చంద్రబాబు అరెస్టు చెసారు. చంద్రబాబు బరువు తగ్గారు, 72 ఉండేవారు, 66కి తగ్గారు, ప్రభుత్వం ఒక కిలో గ్రాం తగ్గారని చెబుతున్నారు. చంద్రబాబుకు ఒక హార్ట్ కండీషన్ ఉంది, అది వైద్యులకు తెలుసని అయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie