రంగారెడ్డి
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు ఇద్దరు వేరు వేరు విమానాల్లో వచ్చిన ప్రయాణికుల వద్ద అక్రమ బంగారాన్ని గుర్తించారు. కొలాంలంపూర్ నుండి హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ప్రయాణికుడి వద్ద 636 గ్రాముల బంగారం గుర్తించారు. నింధితుడు బంగారాన్ని ఫ్యాన్ మోటార్ లో అమర్చుకుని వచ్చి అడ్డంగా కస్టమ్స్ అధికారులకు దొరికి పోయాడు. మరో నిందితుడు రియాద్ నుండి హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు నిందితుడి వద్ద 5 బంగారం బిస్కెట్లు గుర్తించారు కస్టమ్స్ అధికారులు. నింధితుడు బంగారం పాంట్ లోపల దాచుకుని వస్తుండగా పట్టుబడ్డాడు. ఇద్దరి వద్ద పట్టుబడ్డ బంగారం కిలో 268 గ్రాములుగా గుర్థించారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 73 లక్షల 97 వేలు ఉంటుందని అంచనా వేశారు కస్టమ్స్ అధికారులు