సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఏర్ధనూర్ గ్రామ శివారులో ఉన్న గుట్టపై చిరుత పులి సంచారం కలకలం రేపింది. స్థానికులు పశువులను మేపుతుండగా ఒక్కసారిగా గుట్టపై చిరుత ప్రత్యక్షమయింది. దాంతో పశువుల కాపరులు, రైతులు ప్రాణ భయంతో పరుగులు తీసారు.అధికారులకు సమాచారం ఇచ్చారు. చుట్టుపక్కల గ్రామాల్లో చిరుత సంచారం పై జాగ్రత్తగా ఉండాలని డప్పు చాటింపు చేసారు.