సిమెంట్ పోల్ ను ఢీకొన్న బైకుమహిళ మృతి..మరోకరికి తీవ్ర గాయాలు
నరసరావుపేట
రొంపిచర్ల మండల తుంగపాడు వద్ద ప్రమాదవశాత్తు బ్రిడ్జ్ పైన ఉన్న సిమెంట్ పోల్ ను బైకు ఢీకొంది..ఘటనలో బైక్ పై వస్తున్న సోనీ ఈవెంట్స్ చెందిన అశ్విని అనే మహిళ మృతి చెందగా మున్నా అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. సోని ఈవెంట్స్ తరపున రొంపిచర్లలో డ్యాన్స్ ఈవెంట్స్ కి వెళ్లి నరసరావుపేటకి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. మున్నా ది నరసరావుపేట. మృతురాలు అశ్విని ది తెలంగాణకు ( హలియా) చెందిన మహిళగా గుర్తించారు.