గన్నవరం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఇవాళ ఉదయం కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన సీఎం జగన్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. సీఎం జగన్కు గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద సీఎస్, మంత్రులు, డీజీపీ ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ దంపతులు రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి బయల్దేరిన క్రమంలో దారి పొడువునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ నెల 2న ముఖ్యమంత్రి దంపతులు లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే