A place where you need to follow for what happening in world cup

సుమారు 31 లక్షల డూప్లికేట్ కరెన్సీ, 60 వేల నగదు, 13 సెల్ ఫోన్ స్వాధీనం: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

0

రంగారెడ్డి: నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్నా 13 మంది సభ్యుల పేరుమోసిన అంతర్-రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు లు పట్టుకున్నారు. సుమారు 31 లక్షల డూప్లికేట్ కరెన్సీ, 60 వేల నగదు, 13 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెలదించారు.

వివరాల్లోకు వెలితే…
డూప్లికేట్ కరెన్సీ నీ చెలామణి చేసె రాజేష్ గదిని ఖాళీ చేసే సమయంలో నకిలీ నోట్లు ఇచ్చాడు. నకిలీ నోట్లు అసలు నోట్లు లాగా ఉన్నాయి.ఈ విషయం లో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు రావటంతో విచారన మొదలెట్టారు. తదుపరి విచారణలో రాజేష్, మరికొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నకిలీ కరెన్సీ నోట్లను ఎక్కడో రహస్యంగా ముద్రించి చెలామణి చేస్తున్నారు.నిందితుడు రాజేష్ యూట్యూబ్ వీడియోలపై , నకిలీ కరెన్సీ అందుబాటులో ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం మరియు ఖాతా డీపీలో మొబైల్ నంబర్‌ను అందించడం ద్వారా వివిధ ఖాతాదారులు తనను సంప్రదించేలా చేసేవాడు.

నిందితులు రాజేష్ మరియు నీల్ దాస్ వివిధ నకిలీ కరెన్సీ
తయారీదారులు తెలంగాణకు చెందిన రమేష్, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చరణ్ సింగ్ ముఠా మరియు తమిళనాడుకు చెందిన సూర్యతో పరిచయం ఏర్పడింది. వారి నుంచి 1:5 నిష్పత్తిలో నకిలీ కరెన్సీని తీసుకున్నారు. ప్రధాన ముఠా సభ్యులు రాజేష్, నీల్ దాస్ ఈ నోట్లు ఒరిజినల్ కరెన్సీని పోలి ఉన్నాయని 1:3 నిష్పత్తిలో ఇతర ముఠా సభ్యులకు నకిలీ కరెన్సీని సరఫరా చేశారు. రాత్రి మార్కెట్లలో, వీధి వ్యాపారులు, చిన్న దుకాణాలు నిర్వహించేవారి థో నకిలీ కరెన్సీని మార్చేవారు.

డూప్లికేట్ కరెన్సీ నీ చెలామణి చేస్తున్న గ్యాంగ్ లోనీ ఒరిస్సా రాష్ట్రం కు చెందిన కోనేటి రాజేష్, త్రిపుర రాష్ట్రానికి చెందిన నీల్ దాస్, యాదగిరిగుట్టకు చెందిన అడ్డగుళ్ల సుమన్ , హైదరాబాద్ కు చెందిన గురప్పగారి నవీన్ , మెదక్ కు చెందిన లోగ్గరి మధు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరి వినోద్ సతీష్ కుమార్ రెడ్డి, బెంగుళూరుకు చెందిన రోహన్ లక్ష్మణ్ భట్టార్, మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన కు గుర్రాల నవీన్, కృష్ణా జిల్లా కు చెందిన మందడపు ఉదయ్ భాస్కర్ ఏలూరు జిల్లా కే చెందింన పోలోతు శ్రీనివాస్, పల్నాడు జిల్లా కు చెందిన కుంభ తిరుపతి రావు , కోరుట్ల కు చెందిన మొహమ్మద్ ఖతీబుద్దీన్, మహమ్మద్ అస్మత్ @ జమీమ్ ల ను పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా సూర్య, చరణ్ సింగ్ , కస్తూరి రమేష్ బాబు లు పరారిలో ఉన్నారు. సుమారు 31 లక్షల డూప్లికేట్ కరెన్సీ, 60 వేల నగదు, 13 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకునామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తేలిపారు.

Leave A Reply

Your email address will not be published.