Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి

0

విశాఖపట్నం

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం రాడిసన్ బ్లూ హోటల్ లో  జరిగిన ఇండియన్ సైబర్ క్రైమ్ కి ఆర్డినేషన్ సెంటర్ -మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఆధ్వర్యంలో  4th రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ జాయింట్ సైబర్ క్రైమ్ కి ఆర్డినేషన్ టీమ్ ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమన్వయంతో పనిచేస్తూ సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి సంవత్సరం ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు.

అందులో భాగంగా నాలుగవ రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం  వర్క్ షాప్ ను విశాఖపట్నం లో నిర్వహించినట్లు చెప్పారు. సైబర్ నేరగాళ్లకు ఎటువంటి  అవకాశం ఇవ్వకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక అంది పుచ్చుకుంటూ సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనాలన్నారు. ఎంహెచ్ఏ  స్పెషల్ సెక్రటరీ శివగామి సుందరీ నందా  ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ క్రైమ్ తున్న దీరును తెలిపి వాటిని సమన్వయంతో ఎలా ఎదుర్కొనాలో వివరించారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలు పూర్తి సమన్వయంతో సైబర్ నేరాలను అదుపు చేయాలని, సైబర్  నేర కేసులు మరింత సమర్థవంతంగా పరిశోధన చేసి సైబర్ నేరగాళ్లకు శిక్షలు పడేలా చేయాలన్నారు. అదే విధంగా పోగొట్టుకున్న నగదు తిరిగి బాధితులకు అందేలా చేయాలని, మహిళలు,  పిల్లలు సంబంధిత క్రైమ్ లకు పూర్తి అడ్డుకట్ట వేయాలన్నారు.ఈ వర్క్ షాప్ లో విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ. రవి శంకర్ లతో పాటు ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిసాతో పాటు యూనియన్ టెరిటరీ లక్షదీప్ , అండమాన్ నికోబార్, పుదుచ్చేరి , జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie