Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

స్కందమాతగా బాల త్రిపుర సుందరి దేవి భక్తులకు దర్శనం

0

తాడేపల్లిగూడెం
శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం వీరంపాలెంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం స్కందమాతగా అలంకరణలో బాల త్రిపుర సుందరి దేవి భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ నిర్వహికులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి తెలిపారు. వివాహం కాని వారు సంతానమాలస్యమైన వారు స్కందమాతని అర్ర్చించడం వల్ల విశేష ఫలితం ఉంటుందన్నారు. అదేవిధంగా సర్వ శక్తి స్వరూపమైన అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు వివిధ రూపాలలో అలంకరణ చేసే అర్చంచడం వల్ల భక్తులందరూ సర్వశక్తి సమన్వితమవుతారని అందుకనే నవరాత్రులు అత్యంత విశేషమైనవని తెలియజేశారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారు అపారమైన కరుణాచందుగా భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతూ ఉంటుందని తెలియజేశారు. అమ్మవారి దర్శనానికి విశేష సంఖ్యలో భక్తుల విచ్చేశారు చేసిన భక్తులకు అన్నప్రసాద వివరణ చేశారు. విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఈమని శశి కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. మూలా నక్షత్రం శుక్రవారం సందర్భంగాశ్రీ మేధా సరస్వతి ఆలయంలో సరస్వతి పూజలకు విశేషమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 6 గంటల నుండి చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు పూజలు నిర్వహిస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie