Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

స్టీల్ ప్లాంట్ ను పక్కన పెట్టేశారా…?

0

విశాఖపట్టణం, అక్టోబరు 3, (న్యూస్ పల్స్)
ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీగా బీజేపీ ముద్ర వేసుకుంది. విభజన హామీలు నెరవేర్చలేదని ప్రజలు కమలనాథులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వలేదు. విశాఖ– కాకినాడ పెట్రో కారిడార్ ఆచూకీ లేదు. విజయవాడ మెట్రో గురించి అసలు పట్టించుకోవడం లేదు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదు. విశాఖ రైల్వే జోన్ ప్రకటనలకే పరిమితమైంది. కడప ఉక్కు గిట్టుబాటు కాదని చెప్పేసింది. రామాయపట్నం మేజర్ పోర్టు నిర్మాణానికి బదులు రాష్ట్ర సర్కారుతో మినీ పోర్టుగా మార్చేసిందివిభజన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయకున్నా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేసి ప్రజలు జేబులు కొడుతోంది. వంట గ్యాస్ ధరను ఒకటిన్నర రెట్లు పెంచేసింది. నిత్యావసరాలపై జీఎస్టీ పన్నులు బాదేస్తూ సగటు ప్రజల మూలిగలు పీల్చేస్తోంది.

అమరావతి పై కాగ్ అక్షింతలు

ఇవి చాలక విద్యుత్ సంస్కరణలతో జనాన్ని నిలువు దోపిడీ చేయడానికి కంకణం కట్టుకుంది. అర్బన్ సంస్కరణల పేరుతో ఆస్తి, ఇంటి పన్నులను పెంచేసింది. రాష్ట్ర సర్కారుతోపాటు అధికార ప్రతిపక్షాలను గుప్పెట పట్టి నోరెత్తకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాజకీయ విశ్లేషకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మూడేళ్ల నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం కార్మికులతో పాటు ప్రజా సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. కేంద్ర సర్కారు మాత్రం అమ్మకం నుంచి వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెబుతోంది. ఆత్మ బలిదానాలతో సాధించుకున్న ఉక్కు జోలికొస్తే ఖబడ్దార్ అంటూ కార్మికులు కన్నెర్రజేస్తున్నారు. ఉత్తరాంధ్రకు తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంటును అదానీ పోర్టు నానా ఇబ్బందులకు గురిచేస్తోంది. గంగవరం పోర్టుగా ప్రభుత్వం నిర్మాణం చేపట్టినప్పుడు స్టీల్ ప్లాంటు భూములు ఇచ్చారు. ఆ విశ్వాసం కూడా లేదు.

థేమ్స్‌ నదిపై టవర్‌ బ్రిడ్జ్‌లో సాంకేతిక సమస్య పైకిలేచిన వంతెన కిందకురాలేదు..

విదేశాల నుంచి స్టీల్ ప్లాంటు కోకింగ్ కోల్ దిగుమతి చేసుకుంటుంది. ముడిసరుకుతో వచ్చిన షిప్పులకు బెర్త్లు కేటాయించకుండా వేధిస్తోంది. పెంచిన ధరల ప్రకారం చెల్లిస్తేనే సరకు విడుదల చేస్తామని మొండికేస్తోంది.పీకల్లోతు కష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంటు మూడో బ్లాస్ట్ ఫర్నేస్లో ఉత్పత్తి నిలిచిపోయి ఏడాది కావొస్తోంది. వర్కింగ్ క్యాపిటల్ లేక నానా అవస్థలు పడుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్లాంటు విక్రయం నుంచి వెనక్కిపోతే వెంటనే సొంత ఐరన్ ఓర్ గనులు కేటాయించాలి. వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సన్నిహితుడైన గౌతమ్ అదానీకి చెప్పి స్టీల్ ప్లాంటును ఇబ్బందులు పెట్టొద్దని కట్టడి చేయాలి. ఇవేం చేయకుండా జీవీఎల్ మాటలు ఎలా నమ్మాలి ? పంజాబ్ రైతుల వీరోచిత పోరాటంతో వినాశకర వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకున్న కేంద్రం దొడ్డి దోవన అమలు చేస్తోంది. పంజాబ్లో అదానీ భారీ గోదాముల నిర్మాణానికి అనుమతినిచ్చింది. విశాఖ స్టీల్పై పోరాడుతున్న శక్తుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికేనన్నట్లు జీవీఎల్ వ్యాఖ్యలు ఉన్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie