Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

స్వచ్చమైన కుటుంబ కథాచిత్రం అన్నీ మంచి శకునములే

0

అన్నీ మంచి శకునములే ఒక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రం అని… అన్ని వర్గాలను తప్పకుండా అలరిస్తుంది అని ఆ చిత్ర యూనిట్ తెలిపింది. తిరుపతిలోని ఓ ప్రయివేటు హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నీ మంచి శకునములే చిత్ర బృందం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సినిమాలో మంచి కుటుంబ సంబంధ బాంధవ్యాలను చూపించామని దర్శకురాలు నందినీ రెడ్డి తెలిపారు. ఈ సారి వేసవికి చల్లని చిరుగాలిలా ఈ సినిమా మే 18న విడుదల చేస్తున్నామన్నారు. ఓ బేబీ సినిమా తరువాత చేసిన ఈ సినిమాలో మెసేజ్ అనేది ప్రత్యేకంగా చూపించలేదని…. ఓ మంచి విషయాన్ని హీరోహీరోయిన్లతో పాటు పలువురు సీనియర్ నటుల ద్వారా చెప్పామన్నారు.

ఈ చిత్రం నా నిజమైన జీవిత కథలా అనిపించిందని…. ఇంతకంటే రియల్ కథలో ఇప్పటి వరకు నేను నటించలేదని చిత్ర హీరో సంతోష్ శోభన్ తెలిపారు. ఈ చిత్రం యువతతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. కళ్యాణ వైభోగమే తరువాత దర్శకురాలితో ఈసినిమా తనకు రెండోదని… సీనియర్ నటులు, నటీమణులతో నటించినందుకు ఆనందంగా ఉందని చిత్ర హీరోయిన్ మాళవికానాయర్ తెలిపారు..

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie