Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం-  సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

0

భువనేశ్వర్, జూన్ 3

ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. ఈఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు.

 

రైల్వే అధికారులనుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు.ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన జగన్… సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని అంబులెన్స్‌లను ఘటనా స్థలాని పంపించాలని సూచించారు. అత్యవసర పరిస్థితిలో సహకరించేందుకు ఆసుపత్రులను కూడా రెడీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ఎంక్వయిరీ సెల్ ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. ఘటనా స్థలానికి నేరుగా వెళ్లి రాష్ట్రానికి చెందిన వారు ఉన్నా… ఆయా రాష్ట్రాలకు చెందిన వారికి సహాయం కావాలని చేసేలా ఓ బృందాన్ని రెడీ చేశారు. మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌లతో ఏ టీంను రెడీ చేశారు. వాళ్లు స్పాట్‌కు వెళ్లనున్నారు.

 

ఒడిశా రైలు ప్రమాదంపై వివరాలకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు  విజయవాడ,రాజమండ్రి లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.
విజయవాడకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్
Rly -67055
BSNL- 0866 2576924
రాజమండ్రికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్
BSNL: 08832420541
RLY: 65395
దక్షిణ మధ్య రైల్వే హెడ్‌ క్వార్టర్, సికింద్రాబాద్: 040 – 27788516
విజయవాడ : 0866-2576924
రాజమండ్రి : 0883-2420541
సామర్లకోట: 7780741268
ఏలూరు: 08812-232267
తాడేపల్లిగూడెం: 08818-226212
బాపట్ల: 08643-222178
తెనాలి: 08644-227

బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక రోజు సంతాప దినం పాటించాలని ఆదేశించారు. జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.తమిళనాడు ప్రభుత్వం కూడా ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సంతాప దినం ప్రకటించింది. వేడుకలను నిషేధించింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా ప్రధాని కార్యక్రమాలను కూడా మార్చేశారు. ముంబై-గోవాకు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. అది వాయిదా పడింది.ప్రమాదం తర్వాత రైల్వే శాఖ చాలా రైళ్లను దారి మళ్లించింది. ఆ పరిస్థితి లేని ట్రైన్స్‌ రద్దు చేసింది. అలాంటి రైళ్లా జాబితాను విడుదల చేసింది.

దారి మళ్లించిన రైళ్ల జాబితా ఇలా ఉంది.
రైలు నెంబర్ 22807 టాటా జంషెడ్ పూర్ మీదుగా వెళ్తుంది.
రైలు నెంబర్ 22873 కూడా టాటా జంషెడ్ పూర్ మీదుగా వెళ్తుంది.
రైలు నెంబర్ 18409ను టాటా జంషెడ్ పూర్ వైపు మళ్లించారు.
రైలు నెంబర్ 22817ను కూడా టాటా వైపు మళ్లించారు.
రైలు నెంబర్ 15929ను తిరిగి భద్రక్ కు పిలిపించారు.
12840 చెన్నై సెంట్రల్-హౌరా ప్రస్తుతం ఖరగ్ పూర్ డివిజన్ లోని జరోలి గుండా నడుస్తుంది.
18048 వాస్కోడిగామా – షాలిమార్ కటక్, సల్గావ్, అంగుల్ మీదుగా దారి మళ్లించబడింది.
సికింద్రాబాద్-షాలిమార్ (22850) వీక్లీ రైళ్లను కటక్, సల్గావ్, అంగుల్ మీదుగా మళ్లిస్తారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie