సంక్షిప్త వార్తలు:04-08-2025:ప్రవీణ్ పగడాల మృతిపై నిజ నిర్ధారణ చేయాలని పెద్దపల్లి లో శాంతి ర్యాలీ నిర్వహించా రు. పెద్దపల్లి పట్టణంలోని పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు షడ్రక్ పాస్టర్ సుదర్శన్ మాట్లాడుతూ ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ప్రవీణ్ పగడాల మృతిపై సరైన న్యాయం చేయాలన్నారు. పాస్టర్ డేవిడ్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మతం కన్నా మానవత్వం ఉన్నవాడని, అనాధ పిల్లలను
ప్రవీణ్ పగడాల మృతిపై నిజనిర్ధారణ చేయాలి
పెద్దపల్లి ప్రతినిధి:
ప్రవీణ్ పగడాల మృతిపై నిజ నిర్ధారణ చేయాలని పెద్దపల్లి లో శాంతి ర్యాలీ నిర్వహించా రు. పెద్దపల్లి పట్టణంలోని పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు షడ్రక్ పాస్టర్ సుదర్శన్ మాట్లాడుతూ ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ప్రవీణ్ పగడాల మృతిపై సరైన న్యాయం చేయాలన్నారు. పాస్టర్ డేవిడ్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మతం కన్నా మానవత్వం ఉన్నవాడని, అనాధ పిల్లలను
అక్కున చేర్చుకొని విద్యను నేర్పించి వివాహాలు చేశాడన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించి, ఉద్యోగస్తులుగా మార్చాడని, వారి కుటుంబ ఆర్థిక అభివృద్ధిని పెంపొందించ డానికి కృషి చేశాడని తెలిపారు. కుల నిర్మూలనకు కృషి చేస్తూ, మనిషిని మతం దృష్టితో చూడకుండా మనిషిని మనిషిలా చూడాలని హితబోధ చేసేవాడన్నారు. ఇండియన్ మిషన్ స్కూల్ నుండి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలి నిర్వహించి అక్కడ కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, క్రిష్టియన్లు పాల్గొన్నారు.
నిర్దేశిత సమయంలో అభివృద్ధి పనులు పూర్తి కావాలి
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
,పెద్దపల్లి ప్రతినిధి :
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ పై సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ మన జిల్లాలో చేపట్టిన 7 తహసిల్దార్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని, రాబోయే జనవరి నాటికి నూతన తహసిల్దార్ కార్యాలయాల ప్రారంభోత్సవం కావాలని అన్నారు. మంథని పట్టణంలో 4.5 కోట్లతో చేపట్టిన సమీకృత కార్యాల యాల సముదాయం పనులను రాబోయే ఉగాది నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ పంచాయతీ రాజ్ విభాగానికి సంబంధించి పురోగతి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు.
జిల్లాలోని హెల్త్ సెంటర్స్ మరమ్మత్తు పనులు, సబ్ సెంటర్ భవనాలు, పాఠశాలల మరమ్మత్తు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, రెసిడెన్షియల్ పాఠశాలల ,హస్టల్స్ మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, అందుబాటులో ఉన్న నిధులను వినియోగించు కుంటూ సమ్మర్ సీజన్ పూర్తయ్యే లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించా రు. ఈ సమావేశంలో పంచాయతీ ఈఈ రాజ్ గిరీష్ బాబు, డి.ఆర్.డి.ఓ. కాలిందిని, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read also:వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన
మచిలీపట్నం
కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చినా నల్ల చట్టం వక్ఫ్ బోర్డు సవరణకుబిల్లుకు వ్యతిరేకంగా మచిలీపట్టణం ముస్లిం సమాజం నిరసన చేపట్టింది. వెంటనే బేషరతుగా వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున సుమారు 5000మందితో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ కార్యక్రమంలో ముస్లిం సోదరులకు తోడుగా మేము వున్నాం అంటూ మద్దతుగా తెలుపుతూ హిందూ సోదరులు, క్రైస్తవ, దళిత సోదరులు పాల్గొన్నారు
వివిధర రాజకీయపార్టీలు మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమం లో పాల్గొని వాళ్ల సహాయాన్ని అందిస్తూ మీకు మద్దతుగా మేముంటాము అని భరోసా ఇచ్చారు
Read also:క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే విరూపాక్షి
కర్నూలు
కర్నూలు జిల్లా ఆలూరు వైసిపి ఎమ్మెల్యే విరూపాక్షి అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యారు.శ్రీరామనవమి సందర్భంగా విరూపాక్ష స్వగ్రామం చిప్పగరలోని కొండావిధలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి రాములోరి కల్యాణం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే హోదాలో విరూపాక్షి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విరూపాక్షి చేతికి వేద పండితులు మంగళసూత్రాన్ని ఇవ్వగా… ఎమ్మెల్యే స్వయంగా సీతమ్మ వారి మెడలో కట్టేశారు.అయితే దీనికి సంబంధించిన వీడియోల సోషల్ మీడియా వైరల్ కావడంతో హిందూ సంఘాల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఎమ్మెల్యే విరూపాక్ష వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి .దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎమ్మెల్యే విరూపాక్ష స్పందించారు. మీడియా వేదికగా సంజాయిషీ ఇచ్చారు. తెలియక చేసిన తప్పు అని, పండితులు చెప్పిన ప్రకారం తాను చేశానని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పారు. సామాన్య భక్తుడిగానే గుడికి వచ్చారని, సీతారాముల కల్యాణం జరుగుతుండగా పండితుల సూచన మేరకు మాంగళ్యం సీతమ్మవారి మెడలో వేశానని సంజాయిషి ఇచ్చారు.ఇలా చేయడం తప్పేనని ఎమ్మెల్యే ఒప్పుకుంటూ క్షమాపణ చెబుతున్నట్లు ఓ వీడియో విడుదల చేశారు.తన వల్ల పొరపాటు జరిగిందని…పొరపాటుకు చింతిస్తున్నానని, ఈ ఘటన ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని ఆ వీడియోలో విరూపాక్షి చెప్పుకొచ్చారు. అయినా తాను కావాలని ఈ పని చేయలేదని, తన చేతికి మంగళసూత్రం ఇచ్చిన పండితులు చెబితేనే.. దానిని సీతమ్మ మెడలో వేశానంటూ ఆయన చెప్పుకొచ్చారు.