సంక్షిప్త వార్తలు:04-08-2025:విశాఖలోని ఎంజిఎం సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన 22 ఏళ్ల యువకుడు ఆశిష్ చువాల్సింగ్ అవయవదానం చేయడానికి అయన కుటుంబం అంగీకరించింది. ఒడిశాలో సునాబెడా గ్రామానికి చెందిన ఆశిష్ ప్రమాదవశాత్తు అస్వస్థతకు గురికావడంతో ఈనెల రెండో తేదీన విశాఖలో ఎంజిఎం సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. వెంటిలేటర్ పై మూడు రోజులు చికిత్స పొందాడు.
యువకుడి అవయవ దానం
విశాఖపట్నం
విశాఖలోని ఎంజిఎం సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన 22 ఏళ్ల యువకుడు ఆశిష్ చువాల్సింగ్ అవయవదానం చేయడానికి అయన కుటుంబం అంగీకరించింది. ఒడిశాలో సునాబెడా గ్రామానికి చెందిన ఆశిష్ ప్రమాదవశాత్తు అస్వస్థతకు గురికావడంతో ఈనెల రెండో తేదీన విశాఖలో ఎంజిఎం సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. వెంటిలేటర్ పై మూడు రోజులు చికిత్స పొందాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. బ్రెయిన్ డెడ్ ఐనట్లు వైద్యులు నిర్ధారించారు. వారి కుటుంబ సభ్యులు ఆశిష్ అవయవాలు దానం చేసేందుకు ఒప్పుకున్నారు. ఈ యువకుడు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, చిన్న ప్రేగు మరియు క్లోమం దానం చేశారు. దీంతో విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో వాటి అవసరం వున్నవారికి పంపించారు. ఆసుపత్రి యాజమాన్యం , సిబ్బంది ఘనంగా తుదివీడ్కోలు పలికి , ఆయన ధాతృత్వం పదిమందికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.
Read also:ఎమ్మెల్యే ఫొటోలను ప్రొఫైల్ ఫొటోగా వాడుకుని
26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి..
హైదరాబాద్
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సోషల్ మీడియా ఉపయోగించుకుని మోసాలకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఎమ్మెల్యే ఫొటోలను ప్రొఫైల్ పిక్ గా వాడుకుని యువతులను బురిడీ కొట్టించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్నాడు. దీనికోసం షాడి డాట్ కామ్ ను ఉపయోగించుకున్నాడు. షాది డాట్ కామ్ మోసగాడి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారణ చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను వాడుకున్నట్లు నిందితుడు జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్హ వెల్లడించాడు. నాలుగు రాష్ట్రాల్లో 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్నట్టు విచారణలో తేలింది. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తో పాటు కాకినాడలో ఒకే కాలేజీలో చదివిన వంశీకృష్ణ.. 2016 నుంచి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను తన ప్రొఫైల్ ఫోటోగా వాడినట్లు వంశీ కృష్ణ తెలిపాడు. మోసాల కోసం స్నేహితుల పేర్లతో మూడు సిమ్ కార్డులు వాడినట్లు పోలీసులు గుర్తించారు.
Read also:చిన్నంపల్లెలో ఉద్రిక్తత
అన్నమయ్య
ఓబులవారిపల్లి మండలం పెద్దవరంపాడు రెవెన్యూ గ్రామంలోని చిన్నంపల్లె లో ఉద్రిక్తత నెలకొంది. సర్వే నెంబర్ 2202 లో స్థానికేతరులు జేసిబి తో భూ అక్రమ చేస్తుండగా, గ్రామ పరిధిలో ని దళితులు అడ్డుకున్నారు. సోమవారం రెవిన్యూ అధికారులకు దళితులు అర్జీ ఇవ్వగా,మంగళవారం స్థానికేతరులు జేసిబి తో ప్రభుత్వ భూముల చదును చేయబోయారు. రెవెన్యూ అధికారులు దళితులను వెళ్ళిపోవాలని చెప్పి,జెసిబి ని పంపక పోవడంతో దళితులు వాగ్వాదానికి దిగారు. ..
Read alsoపరమ భక్తుడు నరసింహులు
యాదాద్రి
ఒక భక్తుడు ప్రతినెలా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి విరాళం ఇస్తున్నాడు. మునుగోడు నర్సింహులు పటాన్ చెరువు వాస్తవ్యులు. తన తండ్రి దగ్గర నుండి నేటి వరకు తాము సంపాదించిన దాంట్లో స్వామివారికి కొంత భాగం ఇవ్వాలని మా నాన్నగారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నేను నా తర్వాత నా కొడుకు కూడా మాకు వచ్చిన దాంట్లో నుండి ప్రతినెల స్వామివారికి విరాళంగా ఇస్తామని మా కులదైవమైన లక్ష్మీనరసింహుడికి గత నెలలో 50 వేల రూపాయలు ఈ నెలలో పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చామని తెలిపారు దాత మునుగోడు నరసింహులు.
Read alsoగ్యాస్ ధర తగ్గించాలని నిరసన
విశాఖపట్నం
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని విశాఖ సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రం దేశ ప్రజలపై బాదుడు కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఎప్పుడు లేని విధంగా ఒకేసారి 50 గ్యాస్ ధర పెంచిందన్నారు. మరో వైపు … పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ పై 2 రూపాయలు పెంచి ప్రజలపై భారం వేసిందన్నారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ ఛార్జీలు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మళ్లీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల పై మరింత భారాలు పడనున్నాయన్నారు. వెంటనే పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని లేకపోతే ప్రభుత్వాలకు తగిన బుద్ధి ప్రజలు చెబుతారని హెచ్చరించారు.