సంక్షిప్త వార్తలు:04-09-2025:నిర్మాణంలో ఉన్న పుష్కరాల పనులన్ని మే 4వ తేదీ వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించారు. మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు.
మే 4 లోపు పుస్కర్ పనులు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి
నిర్మాణంలో ఉన్న పుష్కరాల పనులన్ని మే 4వ తేదీ వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించారు. మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు.
మొదటగా విఐపి ఘాట్ వద్ద జరుగుతున్న ర్యాంప్ నిర్మాణం, సరస్వతి దేవి విగ్రహ ఏర్పాటుకు జరుగుతున్న నిర్మాణ పనులను, శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న మరుగు దొడ్ల పనులను పరిశీలించి, అక్కడి నుండి ప్రధాన ఘాట్ వద్ద జరుగుతున్న మరుగుదొడ్ల పనులను, విద్యుత్ స్థంబాల ఏర్పాటు, పుష్కర ఘాట్లలో స్నానఘట్టాలు, నిర్మాణ పనులను ఆర్ డబ్ల్యు ఎస్ ద్వారా నిర్మిస్తున్న మంచినీటి ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఈ.ఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మే నెలలో కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతి పుష్కరాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కొన్ని చోట్ల శాశ్వత ప్రాతిపదికన పనుల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని త్వరిత గతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మరుగు దొడ్లు, మంచి నీరు, పుష్కర ఘాట్లలో స్నానఘట్టాలు, బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్ళ ఏర్పాటు చేయాలని మే 4వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి, డీపీఓ నారాయణ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇరిగేషన్ అధికారులు, దేవస్థానం ఈ.ఓ మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Read also:ఏసీబీకి చిక్కిన చంద్రగిరి పంచాయతీ ఈవో
మహేశ్వరయ్య ఇంటిపై మళ్లీ ఏసీబీ దాడులు.
తిరుపతి
తిరుపతి రూరల్ పేరూరు జర్నలిస్టు కాలనీలో ఏసిబి అధికారులు సోదాలు జరిపారు. ఏకదంత అపార్ట్మెంట్ లో చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య అక్రమ ఆస్తుల పై సోదాలు జరిపారు. గతంలో లంచం తీసుకుంటూ ఏసిబి ట్రాప్ కు ఈఓ మహేశ్వరయ్య చిక్కిన విషయం తెలిసిందే. లంచం కేసులో అయన సస్పెండ్ అయ్యాడు. మళ్లీ అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ లో సోదాలు కొనసాగుతున్నాయి. మార్కెట్ విలువ ప్రకారం రూ.30 కోట్లు అక్రమ ఆస్తుల కూడబెట్టినట్లు అంచనా వేస్తున్నారు.
Read also:గౌడ కులస్తులకు న్యాయం చేయాలి
పోలీస్ కమిషనరేట్, జిల్లా కలెక్టర్ రేట్ ముట్టడి
నిజామాబాద్
మంగళవారం నాడు నిజమాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై గౌడ మహిళలపై విడీసీ కమిటీ సాంఘిక బహిష్కరణ చేసిన ఘటనపై నిజాంమాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ, మోకుదెబ్బ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నాలు చేసారు.
తరువాత జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ కు ఎర్గట్ల మండలం తాళ్ళరాంపూర్ గ్రామంలోని బిడిసి కమిటీ సాంఘిక బహిష్కరణ పై చర్యలు తీసుకోవాలని గౌడ కులస్తులకు న్యాయం చేయాలని వినతి పత్రాన్ని అందజేసారు. ఈ కార్యక్రమంలో గౌడ హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర నాయకులు కోటగిరి రామా గౌడ్ జిల్లా అధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చేపూరి జాన గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ గౌడ్ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు దేగామ్ యాదగౌడ్, మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా గ్రామాలలో విడిసి కమిటీల పేరిట ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అటవిక న్యాయాన్ని చలాయిస్టు గ్రామ గౌడ కులస్తులపై, బడుగు బలహీన వర్గాల ప్రజలపై అక్రమ వసూళ్లకు పాల్పడుతూ డబ్బులు ఇయ్యని వారిని సాంఘిక బహిష్కరణ గురిచేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న బీడీసీ కమిటీలను అధికారికంగా నిషేధించాలని విడిసి కమిటీలపై పీడీ యాక్ట్ కింద నాన్ బెలేబుల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని నేతలు పిలుపునిచ్చారు.