సంక్షిప్త వార్తలు:04-27-2025

brs-silver-jubilee-celebration

సంక్షిప్త వార్తలు:04-27-2025:టిఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆదివారం  రజతోత్సవ సభకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యకర్తల తరలింపుకై ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తున్నారు.  గ్రామాల్లో దండోరాతో చాటింపు చాటారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  గంగాధర మండలం బూరుగుపల్లిలో డప్పు కొట్టి దండోరా వేయించారు.

బీఆర్ఎస్ సభకు ఆహ్వానాలు

కరీంనగర్
టిఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆదివారం  రజతోత్సవ సభకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యకర్తల తరలింపుకై ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తున్నారు.  గ్రామాల్లో దండోరాతో చాటింపు చాటారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  గంగాధర మండలం బూరుగుపల్లిలో డప్పు కొట్టి దండోరా వేయించారు. సిరిసిల్లలో ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి ఆహ్వాన లేఖలు  బిఆర్ఎస్ నాయకులు అందచేసారు. కరీంనగర్ మంచి ఎల్కతుర్తి వరకు దారి పొడవున స్వాగత తోరణాలు గులాబీ జెండాలతో పార్టీ నాయకులు నింపేసారు.

అమానుషంగా కుక్కి ఆవుల రవాణా

అక్రమంగా రవాణా చేస్తున్న పశువుల పట్టివేత | Apprehension of smuggled cattle
ఆదిలాబాద్
ఇచ్చోడ మండలం గాంధీనగర్ గ్రామం వద్ద అతి క్రూరంగా పశువులను అక్రమ రవాణా చేస్తున్న లారీను డ్రైవర్ నడి రోడ్డుపై విడిచి పెట్టి పారిపోయాడు. అనుమానం వచ్చి పోలీసులు లారీని తనిఖీ చేయగ దయనీయమైన స్థితిలో 42 ఎద్దులు, 10 ఆవులు వున్నాయి. అతి క్రూరంగా పశువులను లారిలో కుక్కడంతో ఊపిరి ఆడక ఒక ఆవు  మృతి చెందింది. మరికొన్ని పశువులు అస్వస్థతకు గురయ్యాయి. పశువులకు ప్రథమ చికిత్స చేయించి, గోశాలకు తరలించారు. పశువుల అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాశ్మీర్ నుంచి క్షేమంగా తిరుగొచ్చిన మెదక్ వాసులు

జమ్మూ కాశ్మీర్ లో ఇరుక్కుపోయిన మెదక్ వాసులు - Mana Telangana

మెదక్
కాశ్మీర్లో చిక్కుకుని పోయిన మెదక్ వాసులు సురక్షితంగా స్వగృహాలకు చేరుకున్నారు. రోటీన్ పనిలో పడిపోయారు. మెదక్ పట్టణం నుండి కపిల్ చిట్ ఫండ్ కంపెనీ ద్వారా టూర్ ఏర్పాటు చేశారు. మెదక్ నుంచి ఈ నెల 22 ఉదయం 2 గంటల సమయంలో చిట్ఫండ్ మేనేజర్ పవన్  ఐదుగురి బృందం మెదక్ నుంచి బయలు దేరారు. మరునాడు శ్రీనగర్ చేరుకున్నారు.  పహాల్గావ్ లో జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో వీరిని హోటల్లోనే చిక్కుకుని పోయారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. మరోవైపు కుటుంబ సభ్యులు బంధువులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ రఘునందన్ రావు వారికి భరోసా కల్పించారు. శ్రీనగర్ నుండి శనివారం తెల్లవారుజామున సురక్షితంగా మెదక్కు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు.

 

బస్సు బోల్తా…పలువురికి గాయాలు

ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

పల్నాడు
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చీరాల వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద బోల్తా పడింది. బస్సు బోల్తా పడే సమయానికి 25 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. అయితే బస్సు శిథిలాల మధ్య ఓ మహిళ ఇరుక్కుపోయింది. మహిళను కాపాడటానికి క్రేన్లను రంగంలోకి దించారు. బస్సు పగలగొట్టి రెండు గంటల పాటు కష్టపడి బస్సులో ఇరుక్కుపోయిన మహిళను కాపాడారు పోలీసులు. మితిమీరిన వేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు

Related posts

Leave a Comment