సంక్షిప్త వార్తలు:04-29-2025:జిల్లా కేంద్రంలో రోజు రోజుకి దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పోలీస్ స్టేషన్ లేని ఏదో మారు ప్రాంతంలో జరిగినట్టుగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకైతే నగదు, ఆభరణాలు మాత్రమే దొంగలించారు. ఈ దొంగలను ఎవరైనా పట్టుకోవాలని చేసే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి అని వికారాబాద్ పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
వికారాబాద్ పట్టణంలో వరుస దొంగతనాలు
వికారాబాద్
జిల్లా కేంద్రంలో రోజు రోజుకి దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పోలీస్ స్టేషన్ లేని ఏదో మారు ప్రాంతంలో జరిగినట్టుగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకైతే నగదు, ఆభరణాలు మాత్రమే దొంగలించారు. ఈ దొంగలను ఎవరైనా పట్టుకోవాలని చేసే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి అని వికారాబాద్ పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం ఎదురుగానే నాలుగు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి. ఇంత ధర్జాగా దొంగతనం చేస్తున్నారంటే ఎన్ని రోజుల నుండి ఆ ఇళ్లపై కన్నేసి ఉంచారోఆ దొంగలు. రాత్రి వేళల్లో అనుమానస్పదంగా కనిపించే వారిని గుర్తించే విధంగా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
సరూర్ నగర చెరువు లో పడి చిన్నారి మృతి

హైదరాబాద్
అభిత్ ( 6) సరూర్ నగర్ చెరువు లో పడి మృతి చెందాడు. చెరువు చుట్టు పెన్సిగ్ లేకపోవడం తో ఆడుకుంటూ చెరువులో పడిపోయాడు. విషయం తెలిసి కుటుంబసభ్యులు శోక సముంద్రంలో మునిగిపోయారు. చెరువు పక్కనే నిరుపేదలు నివాసం ఉంటున్నారు. సోమవారం చెరువు లో సాయంత్రం నాలుగు గంటలకు చిన్నారి పడిపోయాడు. మంగళవారం ఉదయం వాటర్ లో పైకి తేలడం తో గుర్తించి బయటికి తీసారు.
బీఆర్ఎస్ సభ సూపర్ సక్సెస్

ఎమ్మెల్యే మాధవరం
కూకట్ పల్లి
తెలంగాణ రాష్ట్ర మంత్రులు సిగ్గు విడిచి మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు. వరంగల్ లో జరిగిన బి.ఆర్.ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల పై మూకుమ్మడిగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. లక్షల మంది సభకు హాజరైతే బాహుబలి గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేయడంపై అగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక వరంగల్ నాయకులను కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎలా జరిగిందో వారిని అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. 15 నెలలలోనే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు విరక్తి వచ్చిందని కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో సీఎం, సీఎం అంటూ నినాదాలు చేయడంతోనే మీ పని తీరు అర్థమైందని విమర్శించారు.సభకు విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు త్వరలోనే మళ్ళీ కేసీఆర్ సీఎం కాబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం

కుత్బుల్లాపూర్
పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లి లోనీ రాయల్ ఒక్ ఫర్నిచర్ షాపులో సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ షోరూంలోని రెండవ అంతస్తులో దట్టమైన పొగలు రావడంతో చుట్టూ పక్కల వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. గ్రౌండ్,మొదటి అంతస్తులో షాపు నిర్వహణ వల్ల అందులో పని చేసేవారు,కస్టమర్స్ లేకపోవటం అందులోనూ గోడౌన్ అవ్వడంతో ప్రాణ నష్టం తప్పింది.
పక్క షాపుల వారు గమనించి పోలిసులకు సమాచారం ఇవ్వడంతో… సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రెండవ అంతస్తు లో ఫైర్ సేఫ్టి ,ఎమర్జెన్స ఎక్సిట్ లేకపోవడంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు పోలీసులు. ఐతే భవనం పై అంతస్తులకు అనుమతులు లేకపోవడం,అందులో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా షాపు నిర్వహణ వల్లనే ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యా సముపార్జనతో ఆత్మవిశ్వాసం
![]()
హైదరాబాద్
ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుంచే ఆత్మవిశ్వాసం, ధైర్యం కలిగి ఉండాలని, దీనికి విద్యా సముపార్జన అత్యంత అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. తమకేం కావాలో పిల్లలే తెలుసు కోగలిగేలా తల్లిదండ్రులు వారిని తీర్చిదిద్దాలని అన్నారు. హై విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘థ్రెడ్స్ ఆఫ్ హోప్’ పేరిట విద్యా దాతృత్వం, సీఎస్ఆర్ సమ్మిట్ బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ లో జరిగింది.
ఇందులో సినీతారలు సుస్మితా సేన్, దియా మీర్జా సహా రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డా. బి. భాస్కర్రావు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విరాజ్ మల్హాన్, రేఖా శ్రీనివాసన్, తారా మేనన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హై విజన్ వ్యవస్థాపకులు లైలా కజానీ, అస్లామ్ హిరానీ, డా. ప్యార్ అలీ జివానీ, వీఎస్ గణేష్, పూనం యార్లగడ్డ తదితరులు మాట్లాడుతూ.. ఫౌండేషన్ ప్రస్థా నాన్ని, పేద విద్యార్థులకు అంది స్తున్న సాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా దియా మీర్జా, సుస్మితాసేన్ నడుమ ‘ఫైర్ సైడ్ చాట్’ పేరిట ముఖాముఖి సంభాషణ జరిగింది. వీరిరు వురూ తమ జీవితాల్లోని అనుభవాలను పంచుకున్నారు.
