సంక్షిప్త వార్తలు:04-30-2025:విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.
సింహాచలం చందనోత్సవంలో భక్తుల మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
బాధిత కుటుంబాలకు అండగా వుంటాం

తాడేపల్లి
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటన నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. . ఈ ఘటనలో గాయపడిన వారికి విశాఖ కేజీ హెచ్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. బాధితులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించాం. పోలీసులు, ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు..
సవర్ల బంగారం దోచేసిన దుండగులు
చీరాల, పువ్వాడవారి వీధిలో భారీ చోరీ

చీరాల
పువ్వాడ వీధిలో వుంటున్న మువ్వల శివప్రసాదరావు,భార్య పద్మావతి లు మంగళవారం రాత్రి హాస్పిటల్ కు వెళ్ళి తిరిగి వచ్చేలోపు ఇంటిని దొంగలు దోచేశారు. ఆ దంపతులు ఇంటికి తిరిగి రాగానే చోరీ జరిగిందని గుర్తించారు. కప్ బోర్డ్ లోని 117 సవర్ల బంగారం,1,60,000 నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ సుబ్బారావు బుధవారం చెప్పారు.
హోటల్లో ఘోర అగ్నిప్రమాదం,
14 మంది మృతి

కోల్కొత్తలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి సెంట్రల్ కోల్కతాలోని ఒక హోటల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారని పలువురు తీవ్రంగా గాయపడ్డారని నగర పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ వెల్లడించారు. చికిత్స కోసం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారన్నారు. అలాగే సహాయక చర్యలు సైతం వారు చేపట్టారని వివరించారు. హోటల్లో చిక్కుకున్న పలువురిని వారు రక్షించారని తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. అందుకోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.
అప్పన్న సన్నిధిలో విషాదం..
ఇబ్బంది లేకుండా దర్శనం

విశాఖపట్నం
సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటుచేసున్న విషమయం తెలిసిందే. భారీ వర్షానికి రూ.300 క్యూలైన్ దగ్గర గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన హోం మంత్రి అనిత, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి రావడంతో భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు.
