సంక్షిప్త వార్తలు:10-04-2025

Brief News:10-04-2025

సంక్షిప్త వార్తలు:10-04-2025:సుప్రీం కమిటీని కలిసిన బీఆర్ఎస్ బృందం:సుప్రీం కోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తో తాజ్ కృష్ణా హోటల్  మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం భేటి అయింది. కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితుల పై కమిటీ కి నివేదిక బీఆర్ఎస్ పార్టీ బృందం సమర్పించింది.

సుప్రీం కమిటీని కలిసిన బీఆర్ఎస్ బృందం

హైదరాబాద్
సుప్రీం కోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తో తాజ్ కృష్ణా హోటల్  మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం భేటి అయింది. కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితుల పై కమిటీ కి నివేదిక బీఆర్ఎస్ పార్టీ బృందం సమర్పించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో వాస్తవాలను కమిటీకి వివరించింది. బృందంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్,ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ నేతలు దేవిప్రసాద్,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు. .

Read also: అమూల్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం

Amul enters fresh milk market in State - The Hindu
ఆహ్మదాబాద్
గుజరాత్ లోని అమూల్ డెయిరీ ప్రధాన కార్యాలయాన్ని  పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గురువారం సందర్శించారు. శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ ,అమూల్ డెయిరీ వ్యవస్థకులు త్రిభువన్ వందాస్ కె పటేల్  విగ్రహాలకు నివాళులు అర్పించారు. అమూల్ ఉత్పత్తి తదితర  వివరాలు అడిగి తెలుసుకున్నారు.. వర్గీస్ కురియన్ విడియో గ్రఫిని వీక్షించారు..

Read also:కేయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన

Contract assistant professors | కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్టు చేయడానిని ఖండిస్తున్నాం

వరంగల్ :
వరంగల్ జిల్లాలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. గురువారం నాడు  కేయూ యూనివర్సిటీ బంద్ కు  కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేసారు. జీవో 21 రద్దు చేయాలాని డిమాండ్ చేసారు. తమను రెగ్యులరైజ్ చేసినాకే కొత్త రిక్రూట్మెంట్లు చేయాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అన్నారు.

Read also:అక్రమ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

అక్రమ కట్టడాలపై చర్యలెక్కడ? | - | Sakshi

హైదరాబాద్
బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తున్న అక్రమ ఇంటర్మీడియట్ కాలేజీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని..తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషన్ కు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్,విద్యార్థి నాయకులు పిర్యాదు చేసారు. ఇంటర్మీడియట్ కళాశాలలు బోర్డు నుండి సరైన అనుమతి లేకుండా అనేక కళాశాలలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థలు బోర్డు నిర్దేశించిన ప్రాథమిక నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ఎలాంటి నియంత్రణ లేకుండా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.

వేసవి సెలవులకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ,కాలేజీలో చాలా మంది వేసవిలో అనధికార తరగతులను కొనసాగిస్తూనే ఉన్నారని అన్నారు.ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి విద్యార్థులపై అనవసరమైన విద్యా మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నారు.

విద్యార్థులను,తల్లిదండ్రులను దోపిడీ చేయడమే కాకుండా మన రాష్ట్రంలో విద్యావ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తున్నాయి.  అఫిలియేషన్, అనుమతి లేకుండా నిర్వహిస్తున్న అన్ని కళాశాలలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశారు.
పారదర్శక విద్యా వ్యవస్థను నిర్ధారించడంలో బోర్డు తన బాధ్యతను నిలబెట్టుకోవాలని కోరారు.

Related posts

Leave a Comment