సంక్షిప్త వార్తలు:10-04-2025:ఈనెల 26వ తేదీన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్ లో జరిగే మెగా జాబ్ మేళా నిర్వహణకి సంబంధించిన ఏర్పాట్లను ఈరోజు గురువారం సింగరేణి, పోలీస్, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్ ఇతర శాఖల అధికారులతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు.
పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ లో మెగా జాబ్‌మేళా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి టౌన్, 10 ఏప్రిల్:
ఈనెల 26వ తేదీన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్ లో జరిగే మెగా జాబ్ మేళా నిర్వహణకి సంబంధించిన ఏర్పాట్లను ఈరోజు గురువారం సింగరేణి, పోలీస్, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్ ఇతర శాఖల అధికారులతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. జాబ్ మేళా కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి సుమారు పది వేల నుండి పదిహేను వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. టాస్క్ ప్రతినిధులను సమన్వయం చేసుకుని స్టాల్స్, రిజిస్ట్రేషన్ సెంటర్స్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జాబ్ మేళాకు వచ్చే యువతీ, యువకులు ఇంటర్వ్యూలో పాల్గొనేలా సరిగా గైడ్ చేసేలా వాలంటీర్లను నియమించాలని సింగరేణి జీఎం ను కోరారు. దూర ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులకు రవాణా సదుపాయం, ఎండను దృష్టిలో పెట్టుకొని త్రాగునీరు, మజ్జిగ పాకెట్స్, భోజన వసతి అందుబాటులో ఉండేలా చూసుకో వాలన్నారు. అదేవిధంగా, అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయం చేసుకుని జాబ్ మేళాను సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే అన్నారు.
Read alsoవైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు..
టీడీపీ కార్యకర్త సస్పెండ్
విజయవాడ
వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై తెలుగుదేశం అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. కేసు నమోదు చేయాలని పోలీసులను హై కమాండ్ ఆదేశించింది. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో పోలీసులు కిరణ్పై కేసు నమోదు చేసారు. గుంటూరులో కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. మరోవైపు క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని తనను క్షమించాలని కిరణ్ కోరాడు.
Read alsoహెచ్ సీయూకు సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ
హైదరాబాద్
సుప్రీం కోర్టు నియమించిన సాధికారిక కమిటీ గురువారం నాడు కంచె గచ్చిబౌలిలో క్షేత్రస్థాయి పర్యటించింది. హెచ్ సీయూ ఇష్యూపై ఈనెల 16 వరకు స్టే వున్న సంగతి తెలిసిందే. ఇక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు కమిటీ వచ్చింది. గతరాత్రి ఢిల్లీ నుండి నగరానికి చేరుకున్న కమిటీతో కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ తో పాటు మరో ముగ్గురు సభ్యులున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు హెచ్ సీయూకు కమిటీ చేరుకుంది. కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన,వాస్తవ పరిస్థితులపై కమిటీ ఆరా తీసింది.