Andhra Pradesh:కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవానికి తరలివచ్చే భక్తులకోసం లడ్డూలు సిద్ధం చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏప్రిల్ 6న ప్రారంభమైన శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అత్యంత వైభవంగా శ్రీసీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.
ఒంటిమిట్ట రాముడి కళ్యాణానికి అంతా సిద్ధం
కడప, ఏప్రిల్ 10
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవానికి తరలివచ్చే భక్తులకోసం లడ్డూలు సిద్ధం చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏప్రిల్ 6న ప్రారంభమైన శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అత్యంత వైభవంగా శ్రీసీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. రామచంద్రుడి కల్యాణాన్ని చూసి తరించేందుకు భారీగా భక్తులు తరలివస్తారు. ఈ కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు తిరుమల లడ్డూ ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఈ మేరకు తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-2లో ఏప్రిల్ 09 బుధవారం రోజు శ్రీవారి సేవకుల సాయంతో లడ్డూలను ప్యాకింగ్ చేయించింది. డిప్యూటీ ఈవో శివప్రసాద్, AEO బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది తిరుమలేశుడి సేవకులు 70 వేల లడ్డూలు ప్యాకింగ్ చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం కోదండరాముడు నవనీత కృష్ణాలంకారంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు.
ఉదయం 7:30కు మొదలైన స్వామివారి ఊరేగింపు కన్నులపండువగా సాగింది. భక్త జన బృందాల చెక్క భజనలు, కోలాటాలతో మధ్య భక్తుల కీర్తనలు అందుకుంటూ స్వామివారు ముందుకు సాగారు. అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులు కోదండరాముడి కృపకు పాత్రులయ్యారు. కృష్ణుడి అలంకారంలో ఉన్నందున రామచంద్రుడు వెన్న కుండతో భక్తులకు దర్శనమిచ్చారు.ఏటా నవమి రోజు మధ్యాహ్నం నిర్వహించే కల్యాణం తాను చూడలేకపోతున్నానని బాధపడిన చంద్రుడికి శ్రీరాముడు మాటిచ్చాడని.. అందుకే ఒంటిమిట్టలో పున్నమి కాంతుల్లో కల్యాణం జరుగుతుందని కథనం.చంద్రవంశానికి చెందిన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా రాత్రిపేట కల్యాణం జరిపించే ఆచారాన్ని అనుసరిస్తున్నారని మరో కథనం. కారణాలు ఏమైనా కానీ ఇతర వైష్ణవ ఆలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో సీతారముల కల్యాణ వేడుక పున్నమి కాంతుల్లో జరగడం ప్రత్యేకం. సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్లే దారిలో జాంబవంతుడు ఎదురయ్యాడు. అప్పటికి ఇంకా హనుమంతుడిని కలవలేదు రాముడు. మార్గ మధ్యలో ఓ కొండపై ఆశ్రమం నిర్మించి రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు ఆచిరిస్తూ కనిపించాడు జాంబవంతుడు.
ఆ ఎదురుగా ఉన్న మరో గుట్టపై నుంచి కనిపించి వరాలు ప్రసాదించాడు శ్రీరాముడు. అప్పుడు రామభక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలిచి ఇక్కడ ప్రతిష్టించాడు జాంబవంతుడు. ఎందుకే ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. అందుకే ప్రతి రామాలయంలో ఉండే ఆంజనేయుడు ఇక్కడ కనిపించడు. ఈ క్షేత్రంలోనే పోతన భాగవతాన్ని అనువదించాడని చెబుతారు.ఇంకో కథనం ప్రకారం ఒంటిమిట్ట 1340లో అరణ్య ప్రాంతంగా ఉండేది. అక్కడ కేవలం మృకుండ మహర్షి ఆశ్రమం మాత్రమే ఉండేది. అక్కడికి వచ్చిన రాజా కంపరాయులుకు బోయ నాయకులైన ఒంటడు–మిట్టడు ఇద్దరూ అక్కడున్న రామతీర్థంలో నీటిని ఇచ్చి దాహం తీర్చారు. ఆ తర్వాత ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమైన ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అలా వారి కోరిక మేరకు రాజా కంపరాయలు ఆలయ అభివృద్ధితో పాటూ చెరువు నిర్మాణం కూడా తలపెట్టారు. ఆ బాధ్యతను ఒంటడు, మిట్టడుకి అప్పగించారు. వారిద్వారా అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో ఒంటిమిట్ట అనే పేరొచ్చిందని కూడా చెబుతారు.
Read more:Andhra Pradesh:రోజా సీక్రెట్ మీటింగ్ పై రచ్చ రెండు పార్టీల్లోనూ ప్రచారం