Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ పట్టణాలలో ఆస్తి (ఇంటి) పన్నులు పెరగడం వల్ల ప్రజలపై రూ. 320 కోట్లకు పైగా భారం పడుతోందని పట్టణ పౌర సమాఖ్య ఆరోపించింది. గత ఐదు సంవత్సరాలలో 100% పన్ను భారం పెరిగిందన్నారు. మోడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిందని, పన్ను విధానాన్ని సమీక్షిస్తామని, పన్ను పెంచబోమని మాట ఇచ్చి, కూటమి ప్రభుత్వం తప్పిందని ఆరోపించారు.
పట్టణాల్లో పెరిగిన ఆస్తి పన్ను
కాకినాడ, ఏప్రిల్ 11
ఆంధ్రప్రదేశ్ పట్టణాలలో ఆస్తి (ఇంటి) పన్నులు పెరగడం వల్ల ప్రజలపై రూ. 320 కోట్లకు పైగా భారం పడుతోందని పట్టణ పౌర సమాఖ్య ఆరోపించింది. గత ఐదు సంవత్సరాలలో 100% పన్ను భారం పెరిగిందన్నారు. మోడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిందని, పన్ను విధానాన్ని సమీక్షిస్తామని, పన్ను పెంచబోమని మాట ఇచ్చి, కూటమి ప్రభుత్వం తప్పిందని ఆరోపించారు.ఏపీలో మరోసారి గుట్టు చప్పుడు కాకుండా పన్ను పెంచారని, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా పన్ను పెంపు రద్దు చేయాలని, ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానం చట్టం, జీవో రద్దు చేయాలని, ఆస్తి పన్ను పెంపుపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని పట్టణ పౌర సమాఖ్య హెచ్చరించింది.2025_ 26 సంవత్సరాలకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలలో ఆస్తి( ఇంటి) పన్నును గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వం పెంచిందని, గత సంవత్సరంతో పోల్చితే 15%, 2020_21 సంవత్సరంతో పోలిస్తే 30% ఇంటి పన్ను పెరిగిందని పౌర సమాఖ్య కన్వీనర్ బాబురావు వివరించారు. దీనివలన 320 కోట్ల రూపాయల భారం గృహ యజమానులపై పడుతుందని, 2020వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి నాటి వైసిపి ప్రభుత్వం అద్దె విలువ ఆధారిత పన్ను విధానం స్థానంలో ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిందని ఆరోపించారుప్రజలు వ్యతిరేకించినా చట్ట సవరణ చేసిందని, దానికనుగుణంగా జీవో 198 విడుదల చేసిందని ప్రతి సంవత్సరం 15% పన్ను పెంచే విధంగా ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు.
2021-22 ఆర్థిక సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం 15% పన్ను పెంచుతూ వచ్చారని, దానిపై పౌర సంఘాలు ఎన్నో ఆందోళనలు చేసినా గత ప్రభుత్వం లెక్క చేయలేదన్నారు.ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని సమీక్షిస్తామని, పన్నులు పెంచబోమని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో పేర్కొన్నారని, 2024-25 సంవత్సరంలో కూడా పన్ను పెంపు కొనసాగిందని, 2024 ఏప్రిల్ నుండే పన్నులు పెరిగినందున, ఆ సంవత్సరం తగ్గించలేకపోయామని కూటమి ప్రజాప్రతినిధులు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం పన్నుల పెంపుదల ఉండదని ప్రజలందరూ భావించారని, కానీ 2025 _26 ఆర్థిక సంవత్సరానికి గుట్టు చప్పుడు కాకుండా పన్నులు పెంచడం శోచనీయమన్నారు.ఆన్ లైన్ లో పన్ను పెంచుతూ డిమాండ్ రూపొందించారని కూటమి ప్రభుత్వం మాట తప్పిందని, ప్రజలకు నమ్మకద్రోహం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు భారాలు మోయలేని స్థితిలో ఉన్నారని, భారాలు వేయబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ప్రకటించారు. కానీ దానికి భిన్నంగా ఒకేసారి 320 కోట్ల రూపాయల భారం వేయటం గర్హనీయమ్నారు.2020-21 సంవత్సరంతో పోలిస్తే ఇప్పటికీ 100% పన్నులు పెరిగాయి. గతంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పన్ను పెంపుదల ఉండేది. కానీ 5 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పన్నులు పెంచడం దుర్మార్గమన్నారు.
ప్రతి సంవత్సరం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ విలువల కొరకు భూముల విలువలను ప్రభుత్వం పెంచుతున్నది. దీని ఆధారంగా ఇంటి పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఈ పన్నుల పెంపు భారం గృహ యజమానులపైనే కాకుండా పరోక్షంగా అద్దెదారులపై కూడా పడుతుందన్నారు.మరోవైపు కొత్తగా ఇళ్ళు, భవనాలు నిర్మించుకునేవారు, గదులు అదనంగా కట్టుకునే వారిపై పూర్తి ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వేస్తున్నారు. సవరిస్తున్నారు. దీంతో మరింత భారం పడుతున్నదన్నారు.ప్లాన్ ప్రకారం ఇళ్ల నిర్మాణాలు జరగలేదని, అదనపు కట్టడాలు నిర్మాణం జరిగాయని పేరు చెప్పి,BRS లో రెగ్యులరైజ్ అయిన వాటిని అక్రమ కట్టడాలుగా గుర్తించి ఇంకా అదనంగా 50% పన్ను వేస్తున్నారు. ఈ రూపంలో 100 % నుండి 500% వరకు కొన్ని పట్టణాల్లో కొంతమందికి పన్నులు పెరిగాయన్నారు.పన్ను చెల్లింపు ఒక నెల ఆలస్యమైనా 24 శాతం వడ్డీ.. పెనాల్టీ రూపంలో వసూలు చేయటం అన్యాయమని 30 శాతం వరకు ఇంటి పన్ను పెంచి ఈ నెలాఖరు లోపల పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం మోసపూరితమని ఆరోపించారు. పన్ను పెంచిన విషయం మరుగుపరిచి ,ఐదు శాతం రాయితీ గురించి చెప్పటం వంచించటమేనని పన్నులు పెరిగాయని గుర్తించాలనన్నారు.తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని పెంచిన పన్ను రద్దు చేయాలి. విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం పూర్తిగా చట్టం 44/2020, జీవో 198 రద్దు చేయాలి. హామీ నిలబెట్టుకోవాలని, పలు పట్టణాల్లో గత నాలుగైదు ఏళ్లలో అడ్డగోలుగా పెంచిన పన్నులపై సమీక్ష చేయాలి. గతంలో జరిగిన తప్పులను సవరించాలని డిమాండ్ చేశారు.
Read more:Andhra Pradesh: పి.గన్నవరంలో రెండు వర్గాల కొట్లాట!